AP - కాంపౌండ్ వాల్ వీడియో తీశాడని అరెస్టు !!
ఏపీలో ప్రజాస్వామ్యం ఒక జోక్ గా మారిందని చంద్రబాబు విమర్శించారు. ప్రాథమిక హక్కులకు ఏపీలో తావే లేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రికి నచ్చినిది నేరం కాదని, నచ్చనిదంతా నేరమైపోతోందని చంద్రబాబు ఆరోపించారు. ఇటీవలే పొన్నూరు ఎమ్మెల్యే ఒక కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవం చేశారు. సాధారణంగా కాంపౌండ్ వాల్స్ ప్రారంభోత్సవాలు మరీ పెద్దవి అయితే గానీ ఒక జెడ్పీటీసీ వంటి వారు కూడా రారు. అలాంటి ఒక ఎమ్మెల్యే కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవం చేయడం వైరల్ అయ్యింది.
ఇంత వైరల్ అయ్యింది కదా ఆ కాంపౌండ్ ఎలా ఉందో అందరికీ చూపిద్దాం అని ఒక ఎస్సీ యువకుడు వీడియో తీశారు. ఇదిగోండి.. ఇదే ఎమ్మెల్యే ప్రారంభించిన కాంపౌండ్ వాల్, దీనికి ఒక గేటు పెట్టారు. కేవలం ముందు వైపు మాత్రమే ఉంది. దీనినే ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసింది అన్నది ఆ వీడియోలో చూపించారు. ఎటువంటి అబ్యూజింగ్ వర్డ్స్ వాడలేదు. ఎవరినీ తిట్టలేదు. అయినా కూడా ఆ వీడియో తీసిన యువకుడిని ఎవరికీ తెలియకుండా అరెస్టు చేశారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు ఆ వీడియోను షేర్ చేసి పోలీసులపై, జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలతో జగన్ ను ఇలా విమర్శించారు.
అధికారం అంటే పడిచచ్చే జగన్ ఆధ్వర్యంలోని వైయస్ఆర్సిపి పాలనలో దారుణంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరినీ అబ్యూజ్ చేయకుండా గోడను, గోడపై పోస్టర్ ను వీడియో రికార్డ్ చేసినందుకు ఎస్సీ వర్గానికి చెందిన బేతమాల మణిరత్నం అనే యువకుడిని పొన్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. అదే జిల్లాలో, వైయస్ఆర్సిపికి విధేయతతో ఉన్న ఒక పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు వచ్చినా అతను రోడ్లమీద హాయిగా తిరుగుతున్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పాలనలో ప్రజాస్వామ్యం కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక జోక్ మాత్రమే అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Shocking abuse of power by a megalomaniac YSRCP regime. Bethamala Maniratnam, a young boy from SC community was arrested in Ponnur for recording a harmless video of a poster on a wall. (1/3) pic.twitter.com/dahwLwZbyq
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 25, 2020
పులివెందుల పిల్లి టిడిపి కార్యకర్తలను చూసి భయపడుతుంది.సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటు.
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020
గోడ గ్రాండ్ ఓపెనింగ్ ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టిడిపి కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్టు చెయ్యడం...(1/2) pic.twitter.com/ZdCVkMhrjd