మంగ్లీ … తెలియని సినీ అభిమాని ఉండరు. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన వర్థమాన కళాకారిణి. టీవీ వాఖ్యాతగా, జానపద, సినీ గాయనిగా ఆమె అందరికి సుపరిచితురాలు.
చక్కటి యాస మాట్లాడగలదు. అర్బన్ తెలుగులో అదరగొట్టగలదు. చూడచక్కని రూపం ఆమె కళకు మరో ఆభరణంగా నిలుస్తోంది. ఎక్స్ పోజింగ్ జోలికి పోదు కూడా ఆమె కంటే ఆమె గొంతుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది మంగ్లి.
మంగ్లి అని ఫేమస్ అయినా ఈమె పేరు అది కాదు. అసలు పేరు సత్యవతి. ఇది చాలామందికి తెలియదు.
ఇంకో సంగతి ఏంటంటే… ఆమెది తెలంగాణ అని అందరూ అనుకుంటారు. ఆమె రాయలసీమ అమ్మాయి. అయితే ఆమె తన కెరియర్ మొదలు పెట్టింది తెలంగాణ పల్లె పాటలతో. అందుకే ఆమెది తెలంగాణ అనుకుంటూ ఉంటారు.
మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది.తాండ లోని 5 చదివింది.6 నుండి 10 తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT సంస్థ (Rural Development Trust) ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్.వీ.విశ్వవిద్యాలయంలో మూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది