రాజకీయాలంటే హడావుడి చేయడమే కాదు.. సైలెంట్‌గా కూడా చేయొచ్చని నిరూపిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. నిజానికి గురజాల రాజకీయాలు అంటే.. హోరా హోరీ మాటల యుద్ధం.. నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడి క్కి పోతుంది. కానీ, ఈ సారి అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధాలు లేవు.
దీనికి కారణం.. అధికార పార్టీలోనే నాయకుల మధ్య మాటల యుద్ధాలు సాగుతున్నాయి. సీటు కోసం కుస్తీ లు పట్టుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు సైలెంట్‌గా సాగిపోతున్నాయి. వైసీపీ నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాటలు దూసుకుంటున్నారు. సీటు కోసం రోడ్డెక్కి కుస్తీలు పడుతున్నారు. దీంతో వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ వ్యూహాత్మకంగా పని చేసుకుంటూ పోతోంది.
ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న యరపతినేని మండలస్థాయిలో నాయకులను ఏకం చేస్తున్నారు. జనసేన నాయకులతోనూ టచ్‌లో ఉంటున్నారు. ఇక, మినీ మహానాడులో ప్రకటించిన గ్యారెంటీలను ఇక్కడ గ్రామీణ స్థాయిలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఎన్నికలకు మూడు మాసాల ముందే.. ఇక్కడ ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా పెద్దగా పోటీ కూడా లేకపోవడం.. యరపతినేనికి కలిసి వచ్చింది.
వైసీపీ విషయాన్ని చూస్తే.. టికెట్ లడాయి ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీంతో కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది. టికెట్‌ను ఆశిస్తున్న తనదేనని చెప్పుకొంటున్న జంగా కృష్ణమూర్తి.. ఇక్కడ తన వారిని వెతుకుతున్నారు. మరోవైపు సిట్టింగ్ కాసు మహేష్ రెడ్డి అధిష్టానం దగ్గర మంతనాలు చేస్తున్నా రు. ఫలితంగా క్షేత్రస్థాయిలో వైసీపీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో టీడీపీ ఈ గ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని.. సైలెంట్ ప్రచారానికి, పాలిటిక్స్‌కు తెరదీయడం గమనార్హం.