ఏపీ ఫైబర్నెట్ కేసులో జగన్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చిన వైనం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి దేశపు అత్యున్నత న్యాయస్తానం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు మంగళవారంలోపు బదులివ్వాలని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసు పూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో జగన్, వైసీపీ నేతలకు షాక్ తగిలింది. సుప్రీం నోటీసులకు ప్రభుత్వం ఏం సమాధానవ్వనుంది అన్న సంగతి ఉత్కంఠ రేపుతోంది.
ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చి చాలాకాలమైందని, కానీ, చంద్రబాబుకు మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదని వాదించారు. ఇక, స్కిల్ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తే, ఫైబర్నెట్ కేసులో కూడా వర్తిస్తుంది కదా అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ రోజు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పెండింగ్ పడడంతో సోమవారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాల్సి ఉంటుంది.