ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానం అనేకసార్లు తప్పుబట్టింది. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయానికి న్యాయస్థానం కొట్టివేసింది.
యాజమాన్య కోటాను కన్వీనర్ భర్తీ చేస్తామన్న ప్రభుత్వ నిబంధనపై రాయలసీమ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కాలేజీల యాజమాన్యం తరపున న్యాయవాదులు శ్రీవిజయ్, వేదుల వెంకటరమణ, వీరారెడ్డి, మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.
30శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేయడానికి వీల్లేదని న్యాయవాదులు తెలిపారు. యాజమాన్య కోటా కింద సీటు పొందిన విద్యార్థి మూడొంతులు ఎక్కవ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. వీరికి ప్రభుత్వ పథకాలు అమలు కావని హైకోర్టుకు తెలిపారు. ఉపకార వేతనాలు చెల్లించకుండా తప్పించుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం 30శాతం సీట్లను యాజమాన్య కోటా కింద కేటాయించిందని విమర్శించారు.
ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ పిటిషన్లకు విచరాణ అర్హత లేదని విద్యార్థులకు యాజమాన్య కోటా సీట్లు ఎంపిక చేసుకొనేందుకు వెసులుబాటు మాత్రమే కల్పిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు కీలక ఆదేశాలిచ్చింది. రాబోయే రోజుల్లో 9-12 తరగతులకు కూడా ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని తీసుకొచ్చి అక్కడా యాజమాన్య కోటా ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేస్తారా?
అంతేకాకుండా యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని తప్పుబట్టింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్ చూస్తారనే నిబంధనను కూడా కొట్టివేసింది.
యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో రాష్ట్రంలో చాలా కాలేజీల్లో ఇకనుంచి యాజమాన్య కోటాలో సీట్లు ఇదివరకు లాగానే భర్తీ కానున్నాయి.