Shirley Setia శిర్లీ సేతియా.. తెలుగులో నాగశౌర్యతో కలిసి ‘కృష్ణా బృందా విహారి’లో నటిస్తున్న ఈ అమ్మాయికి చాలా ప్రత్యేకతలున్నాయి.
బాలీవుడ్లో పాటలు పాడేస్తూ, సొంతంగా ఆల్బమ్‌లు రిలీజ్ చేస్తూనే సినిమాల్లోనూ నటించేస్తుందీ అమ్మడు.
అంతేకాదు, లైవ్ పెర్ఫార్మెన్సులతోనూ అదరగొడుతోంది.
కుర్రకారు కోరుకునే గ్లామర్ షో పెద్దగా లేకపోయినా లైవ్ పర్ఫార్మెన్సులప్పుడు మాత్రం ఒక ఊపు ఊపేస్తుందన్నది ఫ్యాన్స్ మాట.
చూడ్డానికి చిన్నగా ఉంటాను కానీ నా ఆశలు, ఆశయాలు, కలలు మాత్రం చాలా హెవీగా ఉంటాయంటోందీ అమ్మాయి.
ఇండియాలోనే పుట్టినా న్యూజిలాండ్‌లో పెరిగి, అక్కడే చదువుకున్న ఈమెను ఫోర్బ్స్ మ్యాగజీన్ తెగ పొగిడేసింది. బాలీవుడ్ ఫ్యూచర్ సింగింగ్ సెన్సేషన్ అని ఫోర్బ్స్ కితాబిచ్చింది.
చెప్పడం మర్చిపోయాను, న్యూజీలాండ్‌లో ఈమెను పైజామా పాప్ స్టార్ అంటారట… కారణం, ఆమె మొట్టమొదటి యూట్యూబ్ వీడియోను తన బెడ్రూమ్లోనే పైజామాలో ఉంటూ షూట్ చేయించుకుందట.