శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా పో-ర్న్ కేసులో జైలుకెళ్లడం చాలా తలవంపులుగా ఫీలైంది
చివరకు మీడియా మీదే కేసులు పెట్టబోయి కోర్టులో తిట్లు తిన్నది
భర్త మీద కూడా అరిచింది.
చాలాకాలం ఆ డిప్రెషన్లో ఉన్న శిల్పాషెట్టి మొత్తానికి మెల్లగా బయటపడింది.
ఇపుడు సాధారణ జీవితం గడపడమే కాదు, హ్యాపీగా ఒక ఫొటో షూట్ కూడా చేసింది.
కొద్దిరోజులుగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా ఈ వారం రెండు మూడు ఫొటో షూట్లు చేయడం గమనార్హం.
ఇక ఆమె చెల్లెలు షమితా శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ 15లో తన నటనతో హృదయాలను గెలుచుకుంది.
షమిత ప్రైజ్ మనీని వదులుకోవడానికి నిరాకరిస్తున్న వీడియోను పంచుకుంటూ, శిల్పా ఒక నోట్ రాశారు, “నా ప్రియమైన తుంకీ, నువ్వు ఎంత సునాయాసంగా ఆడావో, హృద్యంగా మాట్లాడావో చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మనం పెరిగిన విధానం అటువంటిది. నిస్వార్థంగా ఇంత కఠినమైన కానీ నిజాయితీతో కూడిన నిర్ణయం తీసుకోవడం చూసి నాకు గర్వంగా ఉంది. లవ్ యు మై డార్లింగ్ ” అని శిల్పా షెట్టి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.