జగన్ బాణాలే ఇపుడు ఆయనకు బూమ్ రాంగ్ అయ్యాయి.
బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు ప్రభుత్వం పెంచని ఛార్జీలను కూడా పెంచాడు, పెంచుతాడు అని అబద్ధాలు చెప్పిన జగన్ ను అదే పదంతో ఇపుడు టీడీపీ ర్యాగింగ్ చేస్తోంది. పన్నులు, ఛార్జీలు, చివరకు గుళ్లో ప్రసాదాలు రేట్లు కూడా పెంచకపోతే ప్రభుత్వం నడవని దుర్భరమైన పరిస్థితిలో ప్రజల్లో చెడ్డ పేరు వస్తున్నా పెంచక తప్పని స్థితిలో జగన్ ఉన్నాడు.
జగన్ జనాలకు ఇస్తున్న దానికంటే లాక్కుంటున్నది మూడు రెట్లు ఎక్కువ. దీంతో పేదల్లోను జగన్ అంటే అమ్మ బాబోయ్ అని భయపడే పరిస్థితి వచ్చింది.
ఇక వరుస గ్యాంగ్ రేప్ లతో ఏపీలో ఏనాడూ లేని ఘోరమైన పరిస్థితులు నెలకొనడంతో ఆడవాళ్లు భయపడిపోతున్నారు.
ఇక జగన్ వస్తున్నాడంటే రెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి జనాలను ఇబ్బంది పెడుతున్నారు.
ఇక జగన్ టూర్లకు జనాల కార్లను ఎత్తుకుపోయి సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు జగన్ పార్టీ నేతలు, అధికారులు.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. దీనిని అస్త్రంగా మలచుకుని జగన్ పరువును తీసేసింది జనసేన. జగన్ వస్తున్నాడు మీ కార్ల జాగ్రత్తహో అంటూ తిరుపతిలో తీసిన ర్యాలీ సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఎలాంటి కౌంటర్ ఇవ్వలేక వైసీపీ వాళ్లుకిందా మీదా పడుతున్నారు.
జగన్ అన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త ???????? pic.twitter.com/3uP4J8fqGc
— Shruti_Kalyan (@Shruti_Kalyan) May 1, 2022
మే 5 తారీకు జగన్ అన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త ????????????????#ysrjaganmohanreddy#Pawanakalyan #KTR #nadendlamanohar pic.twitter.com/9s5rczde4e
— Akepati Subhashini (@SUBHASHINIjsp) May 1, 2022
అన్న వస్తున్నాడు పరదాలు కట్టండి.. https://t.co/qCSWoiesV5
— I love Amaravati. (@soulofkrishna) May 1, 2022