బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా ఇలాంటి స్టార్ కిడ్స్ డ్రగ్స్ వ్యవహారాల్లో దొరికినపుడు.. వాళ్ల కుటుంబ సభ్యులు వెంటనే రంగంలోకి దిగి వాళ్లు కేసుల్లో ఇరుక్కోకుండా ఏం చేయాలో అదంతా చేసేస్తారు.
వాళ్ల పేర్లు బయటికి రాకుండా చూసుకుంటారు. ఒకవేళ పేర్లు బయటికి వచ్చినా కేసు తీవ్రత ఎక్కువ లేకుండా, వాటి నుంచి సులువుగా బయటపడేలా మేనేజ్ చేస్తుంటారు. ఐతే షారుఖ్ తనయుడు మాత్రం కొంచెం గట్టిగానే ఈ కేసులో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది.
డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడమే కాక.. అలాగే అతడి ఒంట్లో డ్రగ్స్ నిల్వలు బయటపడినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. పక్కా ప్లానింగ్‌తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతణ్ని ఈ కేసులో దొరకబుచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.
ఆర్యన్ ఇలా దొరికిపోయిన నేపథ్యంలో షారుఖ్ తన ఫ్యామిలీ ఫారిన్ వెకేషన్‌ను రద్దు చేసుకుని కొడుకును కాపాడే ప్రయత్నంలో పడ్డాడు. డ్రగ్స్ కేసుల్లో ఎంతో అనుభవం ఉన్న ఓ ప్రముఖ లాయర్‌ను అతడి కోసం నియమించుకున్నాడు.
గత ఏడాది డ్రగ్స్ కేసులోనే రియా చక్రవర్తి తరఫున వాదించిన లాయర్ అతను. ఇదిలా ఉంటే.. ఆర్యన్ ఇలా దొరికిపోయిన నేపథ్యంలో షారుఖ్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అది రెండు దశాబ్దాల కిందటి వీడియో. తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా షారుఖ్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
తన కొడుక్కి మూణ్నాలుగేళ్ల వయసున్నపుడే తాను అతడితో.. ‘‘నువ్వు కావాలంటే దమ్ము కొట్టొచ్చు. డ్రగ్స్ తీసుకోవచ్చు. అమ్మాయిలతో సెక్స్ చేయొచ్చు.. అమ్మాయిల వెంట పడొచ్చు’’ అని చెప్పినట్లుగా షారుఖ్ ఈ వీడియోలో చెప్పడం గమనార్హం.
దానికి కొనసాగింపుగా షారుఖ్ ఏమన్నాడన్నది తెలియట్లేదు కానీ.. షారుఖ్ చిన్నప్పట్నుంచే ఇలా ప్రోత్సహించబట్టే ఆర్యన్ ఇలా తయారయ్యాడంటూ కింగ్ ఖాన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు.