సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లాకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ద్వారా భారతదేశం అంతటా ‘వై’ కేటగిరీ భద్రత లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు బుధవారం తెలిపారు.
పూనవాలా కు భద్రత కోరుతూ పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో భారత ప్రభుత్వం తరఫున డైరెక్టర్ గా ఉన్న ప్రకాష్ కుమార్ సింగ్ ఏప్రిల్ 16 న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన తరువాత కేంద్ర ప్రభుత్వ వై కేటగిరి భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారతదేశం యొక్క COVID-19 టీకా కార్యక్రమంలో ఉపయోగించిన రెండు COVID-19 వ్యాక్సిన్లలో ఒకటైన కోవిషీల్డ్, సీరం తయారు చేసిన విషయం తెలిసిందే.
COVID-19 వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనవాలా కు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఈ లేఖలో సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూన వాలా దేశ రక్షకుల్లో ఒకరుగా నిలిచిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అతనికి కీలక భద్రత కల్పించింది.