అమెరికా చిగురుటాకులా వణికింది.. ప్రపంచం భయంతో గడగడలాడింది.. వందల అంతస్తులు పేకమేడల్లా కూలిపోయాయి.. ఆకాశహర్మ్యం నుంచి మంటలు మరింత పైకి ఎగశాయి.. నల్లని దట్టమైన పొగకు మేఘాలే మాడిపోయాయి. రక్తం, మాంసం తప్ప అక్కడ మట్టి అన్నది కనిపించనంతా మృతదేహాలు ముద్దలు ముద్దలుగా పడి కనిపించాయి.
ఇదంతా సరిగ్గా 20 ఏళ్ల కిందట ఈ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై జరిగిన దాడి ఘటన.
అల్ ఖైదా టెర్రరిస్టులు నాలుగు విమానాలను హైజాక్ చేసి జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు సహా 2,996 మంది మరణించారు.
9/11 అటాక్స్గా పేర్కొనే ఈ దాడుల్లో….. హైజాక్ చేసిన నాలుగు విమానాలతో రెండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు టవర్లను ఢీకొట్టగా, మరో విమానంతో పెంటగాన్‌ను ఢీకొట్టారు. ఇంకో విమానం కూలిపోయింది.
ఈ దాడి తరువాతే అమెరికా ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది. అల్ ఖైదాకు అండగా నిలిచిన తాలిబాన్ల పీచమణచడానికి అఫ్గానిస్తాన్‌కు తన సేనలను పంపించింది. ఇరాక్, లిబియా, సిరియా… ఒకటేమిటి ఎన్నో చోట్ల సైనిక చర్యలకు దిగింది.
అల్ ఖైదా సుప్రీమ్ బిన్ లాదెన్ను వేటాడి వేటాడి చంపింది.
అల్ ఖైదాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు, ఇతర కారణాలతో ఇరాక్ నేత సద్దాం హుస్సేన్‌ను కూడా చంపింది.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడింది.