ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎన్నికల్లో నరేన్ కొడాలి బృందానికి చెందిన సత్యనారాయణ మన్నె.. `తానా ఫౌండేషన్ ట్రస్టీ` పదవి కోసం బరిలో నిలిచారు. తెలుగు భాషన్నా.. తెలుగు వారన్నా… ప్రాణం పెట్టే.. సత్యనారాయణ మన్నె.. తానాలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని.. ప్రపంచ స్థాయిలో ఎదగాలని ఆశించే సత్యనారాయణ.. అనేక రూపాల్లో తానా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారికే కాకుండా.. అమెరికాలోని తెలుగు వారికి కూడా విశేష సేవలు చేరువ చేశారు.
బిహేవియరల్ హెల్త్ క్లినిక్ డైరెక్టర్గా ఉన్న సత్యనారాయణన మన్నె.. ఇన్పోలాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. 2020, 2021లలో తానా బ్యాక్ ప్యాక్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. 22వ తానా సదస్సులో ఆతిథ్య కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఇదే సదస్సుకు CMC కోఆర్డినేటర్గా వ్యవహరించారు. 2007లో తానా సదస్సు ఆతిథ్య కమిటీ సభ్యునిగా కూడా సత్యనారాయణ మన్నె విశేష సేవలు చేసి… తానా గౌరవాన్ని ఇనుమడింపజేశారు.. ఇక, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడిగా 2018-19లో పనిచేశారు.
అదేవిధంగా 2016-17లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ మన్నె సేవలందించారు. ఇక, 2014-15లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం కార్యదర్శిగా సేవలందించారు. అలాగే, 2012-13లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం యువజన ఉపాధ్యక్షుడిగా విశేష సేవలు అందించారు. అదేవిధంగా గోదావరి ఎన్నారైల సంఘం ఉపాధ్యక్షుడిగా.. కూడా సత్యనారాయణ మన్నె సేవలు అద్భుతంగా సాగాయి. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం సహా, తానా, గోదావరి ఎన్నారైల సంఘం వంటి అనేక సంస్థలకు ఉదారంగా విరాళాలు అందించారు. స్థానికంగా అనే దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు సత్యనారాయణ మన్నె. అలాంటి వ్యక్తిని తానా ఫౌండేషన్ ట్రస్టీ గా ఎన్నుకోవడం మనందరి కర్తవ్యం. బాధ్యత కూడా!!