దసరా, హాయ్ నాన్న వంటి హిట్స్ అనంతరం `సరిపోదా శనివారం` సినిమాతో న్యాచురల్ స్టార్ నాని మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ చిత్రంలో ఎస్.జె సూర్య ప్రతినాయకుడి పాత్రను పోషించగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన సరిపోదా శనివారం.. ఆగస్టు 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది.
తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. నిర్మాతలకు దాదాపు రూ. 10 కోట్ల లాభాలను అందించింది. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రూ. 45 కోట్లకు ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
స్ట్రీమింగ్ డేట్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో సరిపోదా శనివారం అందుబాటులోకి రాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నాని లేటెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. కాబట్టి థియేటర్స్ లో సరిపోదా శనివారం చిత్రాన్ని మిస్ అయ్యామని ఫీల్ అవుతుంటే.. ఈ 26వ తేదీన నెట్ఫ్లిక్స్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.