దసరా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనంతరం న్యాచురల్ స్టార్ నాని నుంచి తాజాగా వచ్చిన చిత్రం `సరిపోదా శనివారం`. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో విలక్షణ నటుడు ఎస్.జె సూర్య ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ యాక్ట్ చేసింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సరిపోదా శనివారం మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
రొటీన్ స్టోరీ అయినప్పటికీ.. దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. నాని యాక్షన్ అవతార్, ఎస్.జె సూర్య నటన, ఆసక్తికరంగా సాగే కథనం, సంగీతం, కథలోని పాత్రలకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సరిపోదా శనివారం అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ సొంతం చేసుకోలేకపోయింది. ఫస్ట్ డే నానికి పెద్ద షాక్ తగిలింది.
సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా వర్షాలు ఇబ్బంది పెట్టడం, నార్మల్ వర్కింగ్ డే కావడంతో నాని సినిమా కలెక్షన్స్ పరంగా డీసెంట్ ఓపెనింగ్స్ నే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.88 కోట్ల షేర్, రూ. 8.85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ లో రూ. 4.40 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. అలాగే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సరిపోదా శనివారం మూవీకి రూ. 11.38 కోట్ల షేర్, రూ. 20.40 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లు కాగా.. మరో రూ. 30.62 కోట్ల షేర్ వసూల్ చేస్తే నాని హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమవుతుంది. కాగా, టాక్ పాజిటివ్ గానే ఉండటంతో లాంగ్ వీకెండ్ లో సరిపోదా శనివారం జోరు చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.