రాష్ట్రంలో టీడీపీకి నానాటికి హవా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అంతా టీడీపీ వైపు చూస్తున్నారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ చంద్రబాబు పాలనను బలంగా కోరుకుంటున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాట మొదలు సినీ నటుల వరకు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరుగాంచిన సప్తగిరి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు.
చిత్తూరు లోక్ సభ లేదా శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సప్తగిరి వెల్లడించారు. తనది చిత్తూరు జిల్లా అని, బంగారుపాళ్యం, పుంగనూరులో చదువుకున్నానని చెప్పారు. పేదల కష్టాలు తనకు తెలుసని, పేదలకు సేవ చేసేందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటానని సప్తగిరి అన్నారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్న మాట వాస్తవమేనని, కానీ, ముందు చెప్పడం సరికాదని అన్నారు. 10-15 రోజుల్లో శుభవార్త చెబుతానని సప్తగిరి ప్రకటించారు. టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని అన్నారు.
టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు తన సేవలను పార్టీ వినియోగించుకోవచ్చని అన్నారు. అవసరమైతే రాబోయే ఎన్నికలలో టిడిపి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని, ఎన్నికల్లో తాను పోటీ చేయడంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని సప్తగిరి అన్నారు. ఇప్పటికే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తాను పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.