నిన్నటి నుంచి వైసీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు. సక్రమంగానో, అక్రమంగానో, అడ్డదిడ్డంగానో…. ఎలాగోలా చంద్రబాబు ను, లోకేష్ ను తొక్కేస్తేనే మాకు జీవితం అనుకుని దానికోసం విశ్వప్రయత్నం చేస్తు విఫలం అవుతున్న వైసీపీ మరియు సాయిరెడ్డి గణానికి నిన్నటి నుంచి కలవరంగా ఉంది. నిద్రపట్టడం లేదు. ఒకటి రెండు నిద్రమాత్రలు సరిపోవడం లేదు. ఎక్కువ మింగలేం. పాపం కక్కలేక మింగలేక చివరకు తట్టుకోలేక మాట దాటి గొంతులోంచి మాట పెగిలింది.
ఢిల్లీ నుంచి కేసుల భయం వెంటాడుతున్నా తెగించి మాట్లాడిన కొద్ది గంటల్లోనే సాయిరెడ్డికి ఢిల్లీ నుంచి వార్నింగ్ వచ్చేసింది. కానీ ఢిల్లీ మాట వినాలో, జగన్ మాట వినాలో తెలియని పరిస్థితి. దీనికంతంటకి కారణం… ఏపీకి చెందిన నందమూరి ఆడబిడ్డ పురంధేశ్వరికి ఇటీవలే బీజేపీ అత్యంతకీలక పదవి కట్టబెట్టింది. ఇది సాధారణ నిర్ణయం కాదు. బీజేపీకి ఆత్మ వంటి, సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించే టీంలో భాగమైన రాంమాధవ్ వంటి వ్యక్తి పోస్టును పురంధేశ్వరికి కట్టబెట్టడం జగన్ టీంను కలవరానికి గురిచేసింది.
నయానో, భయానో.. లాభానో ఏపీ బీజేపీలో సోము వీర్రాజుతోసహా అందరిని లొంగదీసుకున్నాం.కాని ఈ మోడీ మాట వినాల్సి వస్తోందని తెగ ఫీలైపోతోంది వైసీపీ టీం. ఉదయాన్నే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి కులదూషణకు దిగారు. ఆంధ్రులకు అందరికీ రాజధాని అయిన అమరావతిని పార్టీ పాలసీ ప్రకారం అమరావతిలోనే ఉండాలని తన అభిప్రాయం, పార్టీ అభిప్రాయం చెప్పిన పాపానికి జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో స్పష్టమైందని విజయసాయిరెడ్డి విమర్శించడం ఢిల్లీ పెద్దలకు కోపం తెప్పించింది.
దీంతో అక్కడి నుంచి గట్టి వార్నింగ్ పంపించారు. కర్నూలుకు ఎలాగూ కోర్టును మార్చలేరు. ఇక విశాఖ ఎలాగూ రాజధాని రాకపోతే నే ప్రశాంతంగా ఉంటుంది. విశాఖకు కావల్సింది కాస్మొపోలిటిన్ లుక్ కానీ ఖద్దరు లుక్ కాదు. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే విశాఖ ఎదుగుతుంది కానీ ఖద్దరు వస్తే కబ్జా అవుతుంది. అందుకే అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ మాటనే పురందేశ్వరి చెప్పారు. దీంతో ఆమెపై సాయిరెడ్డి, జగన్ రెడ్డి కోపగించుకున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలతో చీవాట్లు పడ్డాయట. పాపం… ఎవరి పరిధి వారు తెలుసుకోవాలి. హుందాగా ఉండాలి. అపుడే కదా భవిష్యత్తు.