ఎవరో తెలియదు గాని… ఏపీలో ఆలయాలను టార్గెట్ చేసిన మాటఅయితే నిజం. ఇది ఏ స్థాయికి వెళ్లిందో ప్రతిరోజు ఏపీలో ఏదో ఒక చోట గుడిపై దాడి జరుగుతూనే ఉంది. చివరకు ఎందుకిలా జరుగుతుందని జాతీయ మీడియా ప్రసారం చేసేదాకా వెళ్లిందంటే పరిస్థితి ఎంత అదుపుతప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వారంలో ఇది ఐదో దాడి అంటూ టైమ్స్ నౌ పెద్ద ఎత్తున బ్రేకింగ్ ను ప్రసారం చేసింది.
ఒక్క చర్చిలో సాధారణ అద్దాలు పగిలితే 41 మందిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికే లెక్కలేనన్ని ఆలయాలపై దాడులు జరిగినా, ఇంకా జరుగుతున్నా ముఖ్యమంత్రి మాట్లాడరు. ఎందుకంటే హిందు ఆలయాలపై దాడులు చేసినా, హిందువులను తిట్టినా ప్రజలు ఏమీ అనరు అన్న ధైర్యం. స్వయంగా ఒక ఏపీ మంత్రి హిందు దేవుళ్లను అడ్డదిడ్డంగా తిట్టినా జనం కిమ్మనలేదు. ఆయన ఎంచక్కా జనం మధ్య తిరుగుతున్నారు అంటే …దీనిని ఏమని అర్థం చేసుకోవాలి.
బహుశా జనం తిరగబడలేదు కాబట్టి మేము చేస్తున్న పనులు జనాలకు ఇంపుగా అనిపించాయని అనుకుంటున్నారేమో. తిరగబడితే మీ అరాచక బూతులు, అమ్మనాబూతులు వినాల్సి వస్తుంది కాబట్టి… సమయం వచ్చినపుడు సత్తా చూబిద్దాం… ఈ సంస్కారం లేని వాళ్లపై దాడి చేస్తే బురదలో రాయి వేసినట్టే అని జనం అనుకోబట్టి హిందు దేవుళ్లను తిట్టేవారు హాయిగా తిరగేస్తున్నారు.
దాడులకు కారణం ఏంటో ఎవరో జనాలు అందరికీ అర్థమైంది. కానీ పోలీసులకు అర్థం కావడం లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పోతే ఆలయాలపై వరుస దాడులపై ఏపీ డీజపీ స్పందన హిందువులను మనోవేదనకు గురిచేసేలా ఉంది. మొన్నటి వరకు అన్ని ఆలయాలకు సీసీ టీవీలు, నిఘా ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ఊదరగొట్టింది. ఇపుడేమో ఏపీలో కేవలం 10 శాతం ఆలయాలకే సెక్యూరిటీ వ్యవస్థ ఉందని డీజీపీ చెప్పారు.
చిత్తూరులో నంది విగ్రహం పడగొట్టిన ఫిర్యాదు అందిందట. దానిని దర్యాప్తు చేస్తామని పోలీసు బాసు చెప్పారు. ఒక దాడికి, మరొక దాడికి సంబంధం లేదని చెబుతున్నారు పోలీస్ బాస్. సంబంధం లేకుండా ఒకేరకమైన సంఘటనలు వరుసగా, రాష్ట్ర వ్యాప్తంగా జరగడం ఏంటో ఆయనకే తెలియాలి. శ్రీకాకుళంలో దేవుడి చేయి విరిగిపోవడంపై ఆయన స్పందనే షాకింగ్ గా ఉంది. గత ఏడాది వర్షాలు కురిస్తే ఈ ఏడాది ఇపుడు విగ్రహం చేయి విరిగిపోయిందట. బీజేపీ మాత్రం ఈ దాడులపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమే విచిత్రం.