Sachin Tendulkar Birth Day ఈ రోజు. ఈ సందర్భంగా ఎవరికీ తెలియని ఒక రహస్యం చెప్పుకొందాం.
సచిన్ టెండూల్కర్…భారత క్రికెట్ అభిమానులకు క్రికెట్ గాడ్…ఎన్నో రికార్డులు…మరెన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్…ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నం… దాయాది దేశం పాకిస్థాన్ మొదలు దాదాపు ఆడిన ప్రతి దేశంతోనూ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన సచిన్ కు ప్రపంచమంతా అభిమానులున్నారు.
భారత్ తరఫున సచిన్ అరంగేట్రం 1989లో పాకిస్థాన్ తో జరిగిందని సచిన్ అభిమానులెవరైన ఠక్కున చెప్పేస్తారు.
కానీ, సచిన్ తొలిసారి బరిలోకి దిగింది మన దేశం తరఫున కాదన్న సంగతి అతికొద్ది మందికే తెలుసు.
ఇక, సచిన్ తొలిసారి గ్రౌండ్ లోకి దిగింది మన దాయాది దేశం పాకిస్థాన్ తరఫున అన్న సంగతి చాలామందికి తెలియదు.
ఈ ఆసక్తికర విషయాన్ని సచిన్ తన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వేలో వెల్లడించారు.
1987లో ముంబైలోని బౌర్బన్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుండగా పాకిస్థాన్ క్రికెటర్లు జావెద్ మియాందాద్, అబ్దుల్ ఖాదీర్ లంచ్ బ్రేక్ విరామం తీసుకున్నారు.
ఆ సమయంలో స్టాండ్‌బై ఫీల్డర్‌గా ఉన్న సచిన్ ను పాక్ తరఫున ఫీల్డిండ్ చేయాల్సిందిగా నాటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కోరారట.
దీంతో, పాక్ తరఫున సచిన్ ఫీల్డింగ్ చేసేందుకు తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడట.
అంతేకాదు, ఫీల్డిగ్ చేసే సమయంలో తాను కపిల్ దేవ్ క్యాచ్ పట్టాలని విఫల యత్నం చేశానని మాస్టర్ బ్లాస్టర్ చెప్పుకొచ్చాడు.
పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు ఈ విషయం గుర్తుందో లేదోనని సచిన్ ఆనాటి మెమొరీస్ ను అభిమానులతో పంచుకున్నాడు.