*’తానా ‘ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులు కొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు.
*త్రిముఖ పోటీ నివారణకు ముక్కుసూటి తత్త్వం ఉండే ‘శ్రీనివాస గోగినేని’ని మినహాయించి మిగతా ఇద్దరికీ మధ్య అవగాహన ప్రయత్నాలు కొనసాగింపు.
*ఇప్పటివరకు ‘నిరంజన్ శృంగవరపు’ వాక్కు: పోటీకి సై , విరమణకు నై , ఈయన పోటీపై బెట్టుకు సిద్ధమంటున్న బెట్టింగ్ బంగార్రాజులు.
*క్రితంసారి ఉపసంహరించుకున్నందున ఈ సారి పట్టు మీదున్న ‘నరేన్ కొడాలి’ వర్గం, దీనిపై కూడా బెట్టుకు సిద్ధమంటున్న పందెం రాయుళ్లు.
*అధిష్టానం అనేది నిజంగా ఉందని భావించే వారిలో ఇంకా ఎదో జరుగుద్దని నమ్మకం.
*అంత సీన్ లేదంటున్న వ్యతిరేక వాదులు, ఇంతటితో ఈ దందా ఫినిష్ అని ఫీలింగ్.
*ఈ సందులో బలం పుంజుకుంటున్న ‘శ్రీనివాస గోగినేని’.ఇది చివరకు అదిష్టానం బుడ్డి ముంచే ప్రమాదం ఉందంటున్న జ్యోతిష్కులు.
*ప్రస్తుత పదవిలోని సేవలు గట్టు చేరుస్తాయని ‘నిరంజన్ శృంగవరపు’ లెక్కలు.
*తన జంటిల్మన్ ఇమేజ్ పై ఉన్న నమ్మకంతో ‘వేమన’ శతకం శ్రద్దగా పఠిస్తున్న ‘నరేన్ కొడాలి’.
*పట్టు జారుతుందేమోనని ఆందోళన పడుతున్న స్వయం ప్రకటిత అధిష్టానం.
*ఇదే అదునుగా సమీకృతమౌతున్న ‘తానా’ వ్యవహారాల అసంతృప్తవాదులు.
*గుంభనగా కాపిటల్ డిసి ఏరియా సభ్యులు.
*ఇద్దరు లోకల్ జెంటిల్ మెన్లు ప్రెసిడెంట్ ఎలెక్ట్ కై కాంటెస్ట్ లో ఉన్న మిచిగాన్ రాష్ట్రంలో వేరే ఊర్లోని వాన్ని సమర్థిస్తున్న వారిని విసుక్కుంటున్న ‘డెట్రాయిటర్స్’.
*ఇదే కారణంతో తల పట్టుకుంటున్న ఊర్లోనే వున్న ‘తానా’ మాంత్రికుడు
*జాతీయ స్థాయిలో త్రిముఖ పోటీ అనివార్యమైతే ముగ్గురికీ తలో 30 శాతం గ్యారంటీ ఓట్లు, మిగతా 10 శాతం మొగ్గు ఎటైనా కావచ్చు. బెట్టింగ్ బంగార్రాజులకు పండగే పండగ.
*ఇప్పుడు పదివిలో ఉన్నవారిలో ఎక్కువ మందిని తిరిగి పోటీ చేయించి పట్టు చూపించాలని ‘నిరంజన్ శృంగవరపు’ ‘వర్గం యత్నం.
*వారిలో కొందరిని తస్కరించి ఆధిపత్యం చూపాలనుకుంటున్న ‘నరేన్ కొడాలి’వర్గం.
*సిద్ధమైన రెండు ప్యానెల్లు, వాటిల్లో సగంమంది ఎందుకైనా మంచిదని ‘శ్రీనివాస గోగినేని’ తో కూడా సంప్రదింపులు.
*ఇంత సందట్లోనూ గమ్ముగా ఉన్న ‘అట్లాంటా’ వాసులు, ‘గేమ్ క్లోజర్స్ ‘వాళ్లేనని కొందరి భావన.
*సముద్రంకంటే లోతైన ‘లావు బ్రదర్స్ ‘అంతరంగం, మాంత్రికుడికే అర్ధం కాని వైనం.
*అట్లాంటా తమదేనని అందరి ఆశా, అయినా పీడిస్తున్న అనుమాన భూతం.
*పూర్వపు లెక్కలన్నీ తేల్చే పనిలో అట్లాంటా వాసులు.
*డల్లాస్ లో యధావిధిగా ‘జంతర్ మంతర్’.
*డల్లాస్ ఏ ఇద్దరు వరుసగా నాలుగేళ్లు కలసిఉండని ‘తానా ‘చరిత్ర, ఇంకోసారి పునరావృతమవుతున్న పరిస్థితులు.
*బే ఏరియాలో ఎవరు ఏ వర్గమో వారికే తెలియని విచిత్ర పరిస్థితి.
*ఎవరు గెలిచినా మా ఘనతే అనటానికి రెడీ, కానీ ఎవరు ఓడినా వారి ఓటమే అని భయం.
*ఈ దెబ్బ తో ‘తానా’ సంస్థ గతీ గమనం మారుతుందని ఆశావహ దృక్పధం.
*నిర్లిప్తగా చూ స్తున్న పాత తరం, ఉత్సాహపరుస్తున్న ఆశావాదులు.
*గాడ్ ఫాదర్స్ నీడలో పదవి పొందాలనుకునే వారిలో ఎప్పుడూ కనపడని గందరగోళం. చూసి నవ్వుకుంటున్న ఇరుగుపొరుగు మిత్రులు.
*ఈ టర్మ్ పదవి ప్రామిస్ తో లాస్ట్ టర్మ్ తప్పుకున్నవారిలో భయం, ఎటుపోవాలో ఎవరిని అడగాలో తెలియక తికమక.
*అన్ని నగరాల్లో పోటీల గురించి మొదలైన చర్చలు, రీజినల్ పోటీలపై పెరుగుతున్న ఆశావహులు.
*ఏదో ఒక ప్యానెల్లో చేరటానికి అటు ఇటు పరుగులు. ఎవరు ఒప్పుకున్నా 30 శాతం ఓట్లు గారంటీ అనే ధీమా.
*ఇంకా మంచివారికై ప్యానెళ్లలో ఎదురుచూపులు.
*సందట్లో సడేమియాల్లాగా ‘జంప్ జిలానీలు’.
*ఇటూ అటూ మాట్లాడుతూ, కాల్ రికార్డింగులు చేస్తూ రహస్యాలు చేరవేసే నక్క జిత్తులగాళ్లు, సిగ్గు ఎగ్గూ లేని డబల్ ఏజెంట్లు.
*వారినే తెలివిగా వాడుకుంటూ సెలెక్టీవ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఇంటెలిజెంట్ అభ్యర్థులు.
*సరి కొత్త ‘తానా ‘లో తమదైన పాత్రకి సమాయత్తమౌతున్న ఔత్సాహిక వాలంటీర్స్ , భవిష్యత్ పై ఆశావహ దృక్పధం.
*అనేక నగరాల్లోని స్థానిక తెలుగు సంఘాల సభ్యుల్లో’తానా’సభ్యత్వమున్నవారు కూడా పోటీకి ఆలోచన.
*100 పైగా పదవులు, జాతీయ స్థాయి ఫేమ్ , మరిన్ని భవిష్యత్తు అవకాశాల మూలంగా అందరిలో పెరుగుతున్న పోటీ ఉత్సాహం.
*స్నేహ పూర్వహాక పోటీ తప్పులేదంటున్న పెద్దలు.
సశేషం..