నిశ్శబ్దం మూవీ తర్వాత దాదాపు మూడేళ్లు వెండితెరపై కనుమరుగైపోయిన సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించి డీసెంట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ విజయం తర్వాత సినిమాల ఎంపికలో అనుష్క మళ్లీ మునుపటి జోరును చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఘాతి అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ కృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే అనుష్క తన కెరీర్ లోనే తొలిసారి ఓ మలయాళ సినిమాకు సంతకం చేసింది. అదే కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్. రోజిన్ థామస్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ ఇది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ను 2024 డిసెంబర్ లో విడుదల చేసేందుకు లాక్ చేయబడింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్కకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
రీసెంట్ గా అనుష్క వద్దకు ఆ బిగ్ ప్రాజెక్ట్ వెళ్లిందట. ఇది ఒక స్టార్ మరియు ఒక స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సెట్ అయిన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేయమని మేకర్స్ అనుష్కను సంప్రదించారట. అయితే కథలో తన క్యారెక్టర్ కు ఎటువంటి ప్రధాన్యత లేదనే కారణంతో అనుష్క సున్నితంగా తిరస్కరించిందట. దాంతో వారు రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారట. అయినాసరే అనుష్క ఒప్పుకోలేదు. వారి ఆఫర్ ను ఎడమ కాలితో తన్నేసిందట. గ్లామర్ షో కోసమే అన్నట్లుగా ఉండే ఇటువంటి పాత్రలు తాను చేయనంటూ అనుష్క వారి ముఖం మీదే చెప్పిందట. దాంతో సదరు మేకర్స్ మరొక హీరోయిన్ ను వెతుక్కునే పనిలో పడ్డారట. మరి అనుష్క రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మూవీ ఏదో తెలియాల్సి ఉంది.