హిందుయేతర సీఎం అయిన జగన్ రెడ్డి తప్పులను డైరీలో రాస్తూ ప్రజలందరికీ వివరించే పనిని నరసాపురం ఎంపీ రఘురామకృష్నరాజు చక్కగా చేస్తున్నారు. తిరుమలలో కనీసం స్వామి వారిపై విశ్వాసం ఉందని చెప్పడానికి సంకోచించిన జగన్ రెడ్డి నామాలు పెట్టి నాకు విశ్వాసం ఉందని చెప్పే ప్రయత్నం చేసినా… గుళ్లో కుర్చీ వేసుకుని కూర్చున్నపుడే ఆయన విశ్వాసం ఏపాటిదో అందరికీ అర్థమైందని … మీ సంస్కారానికి ఒక నమస్కారం, ఇకపై అయినా ఇలాంటి పనులు తగ్గించండి. ఇతరుల మనోభావాలపై దాడి చేయకండి అని జగన్ కి రఘురామరాజు హితవు పలికారు.తెలుగు భాష, హిందు సంస్కృతిపై, హిందు ఆలయాలపై దాడి జరుగుతుంటే ఖండించడానికి మీకు మనసు రాకపాయె. మాట రాకపాయె. ఇంకా చాలామంది ఇవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయని అనుకుంటున్నారు. మీకు తెలిసే జరిగాయని వారందరికీ అర్థమయ్యేలోపు మీరు వాస్తవం అర్థం చేసుకుని ఇలాంటి పనులు తగ్గించండి అని సూచించారు.జగన్ గారు, మీరు కొడాలి నానిని తీసుకుని.. చొక్కా వేసుకుని శబరిమలకు వెళ్లే ప్రయత్నం చేయండి. చొక్కా వేసుకుని గురువాయూర్ టెంపుల్ కి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎవరెన్ని చెప్పినా వారు రానివ్వరండి. మిమ్మల్ని అడుగు పెట్టనివ్వరు. కేవలం మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని, మీ ఇష్టానుసారం మా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం, ప్రజలు ప్రతిఘటిస్తే మీ భక్తులు అయిన కార్యకర్తలు మిమ్మల్ని ప్రతిష్టించడం.. ఇవన్నీ కట్టిపెట్టాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని జగన్ ని ఉద్దేశించి వివరించారు రఘురామరాజు.