• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

NA bureau by NA bureau
July 5, 2022
in Movies, Top Stories
1
0
SHARES
128
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జక్కన్న దర్శకత్వ ప్రతిభకు మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల అద్భుత నటన కలగలిపి ఈ సినిమా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంపై పలువురు దర్శక నిర్మాతలు, సినీ ప్రముఖులు, సినీ విమర్శకులు ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే, పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన ఈ చిత్రంపై వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ గతంలో వివాదాస్పద రివ్యూ ఇచ్చాడు.

రాజ‌మౌళి రూ.600 కోట్లు ఖర్చుపెట్టి ఓ త‌లా తోక లేని సినిమా తీశార‌ని, అందుకోసం 6 నెల‌లు పాటు ఆయనను జైలులో పెట్టాల‌ని RRRపై KRK నెగిటివ్ ట్వీట్స్‌తో విమర్శలు గుప్పించాడు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు తీయ‌న‌టువంటి చెత్త సినిమా ఇదని, బాలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ వంటి సినిమా ఇదని అక్కసు వెళ్లగక్కాడు. అయితే, కమల్ ఆర్ ఖాన్ తరహాలోనే ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన సౌండ్ ఇంజనీర్ రేసుల్ పోకొట్టి షాకింగ్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గే లవ్ స్టోరీ (స్వలింగ సంపర్కులు) అంటూ రేసుల్ పోకొట్టి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.నటుడు, రచయిత మునీష్ భరద్వాజ్ ట్వీట్ కు స్పందించిన రేసుల్ ఈ రకంగా అభ్యంతరకర ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది. దీంతో, ఆ ట్వీట్ పై బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు.

‘‘మీరు చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గే లవ్ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అయినా అందులో తప్పు ఏముంది? మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? మీ లాంటి వారి ఉద్దేశ్యాలు ఇంతలా దిగజారడం పట్ల తీవ్ర నిరాశ చెందాను’’ అని శోభు ట్వీట్ చేశారు.

శోభు దెబ్బకు దిగొచ్చిన రేసుల్ తన ట్వీట్ ను సమర్థించుకునే పనిలో పడ్డాడు. ‘‘మీతో ఏకీభవిస్తున్నాను. ఒకవేళ ఇది నిజమే అయినా అందులో తప్పేమీ లేదు. నా ఫ్రెండ్ ను కోట్ చేశానంతే. దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎవరికీ నేరాన్ని ఆపాదించదలుచుకోలేదు’’ అంటూ రేసుల్  మరో ట్వీట్ చేశాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులను గే లు అనుకున్న రేసుల్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Tags: oscar awardee pokuttyResul pokuttyRRR is a gay movierrr movieshobhu yarlagaddshocking comments
Previous Post

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

Next Post

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Related Posts

Top Stories

ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్

June 5, 2023
Top Stories

వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్

June 5, 2023
Trending

టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్

June 5, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Load More
Next Post

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Comments 1

  1. Pingback: ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra