పొలిటికల్ డైలాగులు పలికే రోజా మళ్లీ ఓ తప్పిదం చేశారు. ఆ వివరం ఈ కథనంలో..జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు అని ఆ రోజు చినబాబు లోకేశ్ ను నానా మాటలూ అన్నారు. వాళ్లు కూడా తప్పునకు దొరికిపోయారు కనుక ఆగిపోయారు. ఆ తరువాత చాలా పరిణామాలు జరిగాయి.
రోజా కూడా ఎంతో స్పీడుగా మంత్రిగా ఎదిగి తన హవాను చాటుకుంటున్నారు. అప్పటి కన్నా ఇప్పుడు మాటలో వేగం పెరిగింది. విధేయతలో తీరు తగ్గింది. మరి! ఆ రోజు ఆయన్ను టార్గెట్ చేసిన రోజా ఇవాళ చేసిన ఓ కీలక తప్పు చేశారు. దిద్దుకుంటారా ? కనీసం క్షమాపణలు అయినా చెప్పుకుంటారా ? చెంపలేసుకుంటారా?
నాయకులెవ్వరయినా తప్పులు చేయాలి. చేస్తారు కూడా ! తప్పులు దిద్దుకోవడంలో విజ్ఞత పాటిస్తే గొప్ప నాయకులు అవుతారు. పేరు మరియు కీర్తి ఏకకాలంలో దక్కుతాయి. రోజా ఎంతో కాలంగా వేచి వేచి మంత్రి అయ్యారు. ఆ మాట మరిచి పోకూడదు. పదవి కోసం పరితపించి పోయారు. ఆ విషయం కూడా మరిచిపోకూడదు. పదవి రాలేదని అలకబూనారు అది కూడా మరిచిపోకూడదు. ఇన్ని జరిగాక కూడా రోజా తన జాగ్రత్తలో తాను ఉండకపోతే ఎలా ? మాట్లాడేటప్పుడు తప్పులు దిద్దుకోకపోతే ఎలా ?
ఇవాళ అల్లూరి వర్ధంతి. మన్యం వీరుడు అల్లూరిని స్మరిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు ఓ పోస్టర్ జత చేశారు. అందులో తారీఖు మే నాలుగు అని ఉంది. మే ఏడు అని ఉండాలి. మే నాలుగు, 1924 అని వచ్చింది. వెంటనే జనసేన చూసి స్పందించి, రోజాను టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేసింది. ఇదే మొదట ట్రోల్ అయింది. అదే విధంగా అల్లూరి ఆశయ సాధనకు తాము కృషి చేస్తున్నామని చెప్పారే కానీ ఏ పాటి నిధులు అందుకు కేటాయించారో ముఖ్యంగా కొత్త గా పాడేరు కేంద్రంగా ఏర్పాటయిన అల్లూరి సీతారామ రాజు జిల్లాకు ఏ పాటి సాయం చేశారో మాత్రం చెప్పలేదు. ఇకపై చెప్పరు కూడా !
వర్థంతికీ జయంతికీ తేడా తెలియని రోజా మనకి మంత్రి. pic.twitter.com/TJBlvOQiTg
— Telugu Desam Party (@JaiTDP) May 7, 2022
అల్లూరి గారి వర్థంతి రోజు
రోజా గారి అల్లూరి జయంతి స్కిట్
బాగా పండిందికానీ ఆమెకు
ఇన్స్పిరేషన్ ఇచ్చే
గురువుగారిని మరిచారు.ఇది ఖండనీయం. #AlluriSitaRamaRaju pic.twitter.com/Mrn09aovZg
— చాకిరేవు (@chaakirevu) May 7, 2022