కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, అయితే.. వారి ప్రయత్నాలు ముందుకు సాగవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ఉపఎన్నికలో రెండు పార్టీలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని ఆయన విమర్శించారు.
కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకు, ఆయన కళ్లలో ఆనందం చూసేందుకు ఆ పార్టీ నాయకులు.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ పార్టీ చేసిన అకృత్యాలకు.. ప్రజావ్యతిరేక నిర్ణయాలకు ఆ పార్టీకి ఉరివేసినా.. తప్పులేదని.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటకే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు మునుగోడు ఉపఎన్నిక, పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలు కుప్పకూలాయని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచార వ్యూహంలో భాగంగా పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు.
ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని… నల్లగొండ జిల్లా కు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం జరగలేదని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ ఎస్, బీజేపీ పని చేస్తున్నాయని.. వారి ఆటలు సాగనివ్వబోమని నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఉప్పు, పప్పు చివరకు పాలు, పెరుగుపై జీఎస్టీ వేశారని మండిపడ్డారు. మోడీ ఇచ్చిన హామీ ప్రకారం 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సిందన్నారు. మోడీ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో 50 లక్షలు రావాలని గుర్తుచేశారు. మునుగోడులో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది అరాచక పాలన అని మండిపడ్డారు. టీఆర్ ఎస్‌కు ఉరి వేసినా తప్పు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments 1