ప్రముఖ మాజీ నటి, ఎంటర్టైనర్ రేణు దేశాయ్ ఆధ్యాత్మిక మందిరాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ లౌకిక వాదాన్ని ప్రశ్నించారు. ఆమె వేసిన ప్రశ్న ఆలోచన పరులను కూడా ఆశ్చర్యంలో పడేసిందంటే… అతి శయోక్తి కాదు. ఏ విషయంలో అయినా తాను నమ్మింది నిక్కచ్చిగా చెప్పే సినీ నటి రేణు దేశాయ్ తాజాగా అత్యంత వివాదాస్పద అంశంపై స్పందించడం గమనార్హం. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఇప్పటివరకు ప్రోమో మాత్రమే బయటకు వచ్చిన ఆ వీడియో ఇంటర్వ్యూ లో రేణు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘మన దేశంలో మసీదులు, చర్చిలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయి. దేవాలయాలు మాత్రం ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. అలాంటప్పుడు భారత్ లౌకిక దేశం ఎలా అవుతుంది? మసీదులు, చర్చిలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని నేను చెప్పడం లేదు. కానీ దేవాలయాలను కూడా ప్రభుత్వ అధీనం నుంచి తప్పించవచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు.
నిజమే అయితే…. అన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలి. లేదా అన్నింటినీ ప్రయివేటు ఆధీనంలో ఉంచాలి. కానీ ఇదేం చోద్యమో. హిందువుల మీద ప్రభుత్వాల ఆధిపత్యం, గుళ్ల ఆదాయాన్ని ప్రభుత్వాలు ఇతరాలకు వాడుకోవడం దారుణమైన విషయం. ఈ ఫుల్ వీడియో బయటకు వస్తే పెద్ద వైరల్ అయ్యేలా ఉంది.