• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రసీదుపై మత ప్రచారం..విశాఖ పోలీసులేమన్నారంటే…

admin by admin
November 26, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
143
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని టీడీపీ, బీజేపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నవారిపై జగన్ కఠిన వైఖరి అవలంబించడం లేదని, కఠిన శిక్షలు విధించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం వ్యవహారం దుమారం రేపింది. ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏదోలా సద్దుమణిగేలా చేసింది. అయితే, తాజాగా విశాఖపట్టణం ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఆటో రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ఉన్న ఘటన వివాదానికి కేంద్రబిందువుగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉండడం కలకలం రేపింది. పోలీసులు తమకు జారీ చేసిన రసీదులను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

దీంతో, ఈ తరహాలో కొందరు పోలీసులు మత ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ట్రాఫిక్ పోలీసులపై పలు హిందూ సంఘాల నేతలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం దుమారం రేపడంతో పోలీసులు వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. తమ వద్ద రసీదులు అయిపోయాయని, దీంతో, రెగ్యులర్ గా రసీదు పుస్తకాలు ముద్రించే వ్యక్తి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని తెలిపారు.

కానీ, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూసిన వెంటనే వాటిని జారీ చేయడం ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇచ్చారు. గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు పబ్లిసిటీ కోసం ఆ రసీదులు సరఫరా చేసేవి. దీంతో, ఆ రసీదులపై సదరు కంపెనీ పేరుండేది. కానీ, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లు లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

Tags: religious preachingtraffic policevizag
Previous Post

ఒక్క మగాడు మరకల్ని చెరిపేస్తుందా?

Next Post

ఎమ్మెల్యేల కొనుగోలుపై రఘురామ కామెంట్స్

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post
Raghu Rama Krishna Raju

ఎమ్మెల్యేల కొనుగోలుపై రఘురామ కామెంట్స్

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra