తాను సంక్షేమ పథకాలు ఇబ్బడిముబ్బడిగా పెడుతున్నారు. ప్రజలందరు తన వైపే ఉన్నారు అంటున్నారు. వలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. జనంలో జగన్ అంటే నమ్మకం ఉందని చెబుతున్నారు. మరి రెఫరెండం తీసుకోవడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు.
ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని చెప్పి ప్రజలను నమ్మించారు జగన్. అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకున్నారు. మాట మార్చుకున్నారు. సరే ఇప్పటికీ జనం 3 రాజధానులు కావాలని కోరుతున్నారని జగన్ చెప్పారు. అలాంటపుడు 3 రాజధానులా? ఒక రాజధానా అనే దానిపై రెఫరెండం పోతే జనం ఏమంటారో తెలిసిపోతుంది కదా.
పోనీ ఒక్క మంగళగిరినో, గుంటురునో ప్రాతిపదికగా తీసుకున్నా సరిపోతుంది కదా. మరి ఎందుకు ఆ మాట తప్ప వైసీపీ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే అసలు రెఫరెండానికి వెళ్లాల్సింది ఎవరు. కింద వీడియోలో తెలుసుకోండి.