మొదట్నుంచి అందరికి ఉన్న అనుమానాన్ని WHO కూడా ధృవీకరించింది. కరోనా మరోణాలు మన కు కనిపించిన అధికారిక లెక్కలు మాత్రమే కాదని తేల్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాలు ఏంటంటే…. మొత్తం 30 లక్షల మంది కరోనాతో చనిపోయి ఉంటారని అంచనా వేసింది. అయితే 2020 డిసెంబర్ 31 వరకు అధికారికంగా 18 లక్షలు చనిపోయినట్టు పేర్కొంది. కానీ అసలు లెక్క 30 లక్షలు ఉంటుందని అనుమానపడింది.
ప్రపంచంలోని అసమానతలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి తదితర కారణాల వల్ల లెక్కల్లో తేడాలున్నాయని అన్నారు. ఏదేమైనా మరణాల సంఖ్య తక్కువగా నమోదైందని డబ్ల్యూహెచ్వో అధినేత టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు.
మార్చి నుంచి ఇండియాతో పాటు పలు దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. పాత గణాంకాలను బట్టి చూస్తే…సెకండ్ వేవ్ ప్రభావంతో మరణాల తీరును పరిశీలిస్తే … 2021 మరణాలు రెట్టింపు ఉండొచ్చని WHO చెబుతోంది.