రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులతో వైసీపీ అధినేత, సీఎం జగన్కు తలనొప్పులు వస్తు న్నాయా? వారి దూకుడు సీఎంను రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తోందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఒకరు, కర్నూలు జిల్లా నుంచి ఒకరికి మంత్రులుగా జగన్ అవకాశం ఇచ్చారు. ఇద్దరూకూడా బీసీ సామాజిక వర్గానికిచెందిన వారే కావడం గమనార్హం.
వీరిలో గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్ ఉన్నారు. గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు. ఈయనకు రెండు సార్లు కూడా మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇక, ఉషశ్రీచరణ్ను మాత్రం రెండోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రులు వివాదాలకు కేంద్రంగా మారారు.
గుమ్మనూరు జయరాంపై ఇప్పటికే మెర్సిడెజ్ బెంజ్ కారును ఒక కంపెనీ నుంచి తీసుకున్నారనే ఆరోప ణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ కూడా జరిగింది. టీడీపీ నాయకుడు అయ్య న్నపాత్రుడు బహిరంగ విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఓ కుటుంబానికి చెందిన భూములను కూడా ఈయన ఆక్రమించుకున్నారని.. అదేవిధంగా రైతులకు చెందిన భూములు కూడా రాయించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఇది కోర్టు పరిధికి చేరింది.
ఇక, తాజాగా మంత్రి ఉష శ్రీచరణ్.. కూడా భూ వివాదంలో చిక్కుకుపోయారు. ఒక కంపెనీ సేకరించిన భూములను మంత్రి తన అధికారంతో తక్కువ ధరలకు వారి నుంచి దక్కించుకున్నారని.. ఈ క్రమంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారనేది.. అభియోగం. ప్రస్తుతం ఈ రెండు విషయాలు కూడా మంత్రులను రోడ్డున పడేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డు చూపించేందుకు.. ఈ మంత్రులను వినియోగించుకునేందుకు ఇబ్బందులు వస్తున్నాయనేది అధిష్టానం చెబుతున్న మాట. మొత్తానికి వీరి వ్యవహారం పార్టీకి సంకటంగా మారింది.