ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి(తానా) సంబంధించిన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తానా అభ్యున్నతి కోసం, తెలుగు వారి అభివృద్ధి కోసం అహరహం శ్రమించే రవి మందలపు.. ఈ ఎన్నికల్లో తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తానాతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకుని.. తానా అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న రవి మందలపును గెలిపించుకోవడం మనందరి బాధ్యత. రవి మందలపును గెలిపించుకోవడం అంటే.. మనల్ని మనం గెలిపించుకున్నట్టే. ఒక్క క్షణం ఆలోచించి.. మన కోసం.. తన తానా కోసం నిరంతరం శ్రమిస్తున్న రవి మందలపు ఓటేద్దాం.. అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించుకుందాం.
ఇవీ ప్రత్యేకతలు…
తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న రవి మందలపును ఎందుకు గెలిపించుకోవాలనే ప్రశ్న సర్వసాధారణం.. మరి ఆయన విశేషాలు ఏంటి? తానాతో ఆయనకు ఉన్న అనుబంధం ఏంటి? ఇప్పటి వరకు ఆయన చేసిన సేవలు ఏంటి? అనే విషయాలను పరిశీలిస్తే.. రవి మందలపును గెలిపించుకోకుండా ఉండలేం. అవేంటంటే..
2004 నుంచి తానాలో జీవిత కాల సభ్యునిగా రవి కుమార్ మందలపు సేవలు అందిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఆయన ఎలాంటి విమర్శలు రాకుండా.. పటిష్టమైన పనితనంతో ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకొని పోవడంతోపాటు.. తానా అభ్యున్నతే తన అభ్యున్నతిగా భావిస్తూ.. తెలుగు వారికి సేవ చేయడాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు సాగుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన తానా ఫౌండేషన్ ట్రస్టీగా(2021-2025) ఇప్పుడు ఎన్నికల్లో నిలిచారు.
ఇక, తానాలో సభ్యునిగా ఉన్న కాలం నుంచి అట్లాంటిక్ ప్రాంతంలో తక్కువ కాలంలోనే ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి తానా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు తన వంతు సాయంగా వేలాది డాలర్లును విరాళాలుగా అందించారు. 2019లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన తానా సభలకు పెద్దమొత్తంలో విరాళం అందించి అందరి ప్రశంసలు పొందారు.
ఇక, ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు.. కొన్ని వేల డాలర్లు వెచ్చించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహారాన్ని అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, మాతృభూమి రుణం తీర్చుకోవడంలో భాగంగా చేపట్టిన ‘జన్మభూమి` కార్యక్రమం కింద అనేక పాఠశాలలను కంప్యూటరీకరణ చేసే కార్యక్రమానికి కూడా భారీగా విరాళాలు సేకరించారు. అంతటితోనే ఆగిపోకుండా.. తాను కూడా విరాళాలు ఇచ్చి.. వందల సంఖ్యలో పాఠశాలలను కంప్యూటర్ విద్య వైపు నడిపించారు.
మరీ ముఖ్యంగా `జై కిసాన్` అన్న స్ఫూర్తిని అణువణువూ నింపుకొని ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అవసరమైన మేరకు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా తానా సభ్యునిగా గడిచిన నాలుగేళ్లలో సంస్థ చేపట్టిన ఎన్నో కార్యక్రమాల్లో, సంస్థకు అవసరమైన ప్రతి సందర్భంలోను నిబద్ధత చాటుకున్నారు. అమెరికా గడ్డపై భారతదేశ ఔన్నత్యం, తెలుగు ప్రజల ఉన్నతిని కాపాడే ప్రతి వ్యక్తిని ముందుండి నడిపించడంలో విశేష కృషి సల్పారు. మరీ ముఖ్యంగా తెలుగు జాతి అభ్యున్నతి కోసం రవి మందలపు అనేక వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఇదే స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయడంలోనూ రవి మందలపు ముందుంటున్నారు..
ఎందుకు గెలిపించాలంటే..
సొంతలాభం కొంత మానుకుని.. పొరుగు వాడికి తోడు పడాలనే లక్ష్యాన్ని.. ఆదర్శాన్ని అణువణువునా నింపుకొన్న రవి మందలపు వంటి వారు వందల్లో ఒక్కరు మాత్రమే మనకు కనిపిస్తారు. అలాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవడం అంటే.. మరోసారి గౌరవించుకోవడం అంటే.. మనల్ని మనం ఎన్నుకోవడమే.. మనల్ని మనం గౌరవించుకోవడమే.. ఈ నేపథ్యంలో రవి మందలపు అభ్యర్థిత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ కూడా! ఇంకెందుకు ఆలస్యం.. రవి మందలపును గెలిపిద్దాం.. మన కోసం అహరహం శ్రమించే నాయకుడిని ప్రోత్సహిద్దాం.