గత 6 నెలల్లో ఏ షేరు పట్టుకున్నా సిరులు కురిపించింది. కొన్ని షేర్లు డబుల్ అవగా… కొన్ని షేర్లు అనేక రెట్లుపెరిగాయి. 90లలో విప్రో కంటే లక్ష కోటి అయ్యింది అని చెప్పుకుంటే విన్నాం. కానీ అన్ని దశాబ్దాలు ఎందుకు గత ఆరు నెలల్లో ఇలాంటి వార్తలు చాలా వినేలా చేసింది బుల్ మార్కెట్.
రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ (Rattanindia Enterprises Ltd) స్టాక్ తన వాటాదారులకు ఆరు నెలల్లో 841% రాబడిని అందించింది. ఈ షేరు ఏప్రిల్ 30, 2021 న రూ .4.95 నుండి ఈరోజు రూ. 44 కి పెరిగింది, గత ఆరు నెలల్లో 800 శాతం పెరిగింది. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 న రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం ఈ రోజుకి రూ. 8 లక్షలుగా మారేదన్నమాట.
నిజానికి నెల క్రితమే ఈ షేరు 70 రూపాయల దాకా వెళ్లింది. అంటే దాదాపు 1200 శాతం పెరిగిందన్నమాట. మళ్లీ కొంచెం తగ్గి ఇపుడు 44 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
బిఎస్ఇలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 6,054 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీకి నలుగురు ప్రమోటర్లు (ఓనర్ షిప్) 74.75% వాటాలు కలిగి ఉండగా…. పబ్లిక్ వాటాదారులు 25.25% ఉన్నారు.
అయితే, ఆర్ధిక పనితీరు సంస్థ యొక్క స్టాక్ పెరుగుదలకు అనుగుణంగా లేదు. రతన్ ఇండియా గ్రూప్ పవర్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు వేసే కంపెనీలకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియలోను ఉంది.
ఏప్రిల్ లో రివోల్ట్ (Revolt ) అనే ఎలక్ట్రిక్ బైక్ కంపెనీని కొన్నది. అప్పట్నించి ఈ షేరు బాగా పెరిగింది. ఎందుకంటే ఈవీ షేర్లు బాగా బూమ్ లో ఉన్నాయి ఇపుడు. ఈ షేర్ కి ఇంత హైప్ రావడానికి కారణం ఇదే.