సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అమరావతి రాజధానిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచిన సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టే ప్రయత్నం ఓ వైపు చేస్తున్న చంద్రబాబు మరోవైపు అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ తదితర శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఇన్నొవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్స్ ల నేపథ్యంలో ఈ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ ప్రతి విషయాన్ని మెంటార్ చేస్తాయని, అభివృద్ధి అవుతున్న సెక్టార్లలో టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్ కు కృషి చేస్తాయని అన్నారు. ఏపీలోని 5 జోనల్ సెంటర్లతో ఈ హబ్ అనుసంధానవుతుందని అన్నారు. అంతకుముందు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కృషి వల్ల టీసీఎస్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయబోతోన్న సంగతి తెలిసిందే.