ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. గతంలో అయితే జయమాలిని మొదలు ముమైత్ వరకు ఐటమ్ గర్ల్స్ ప్రత్యేకంగా ఉండేవారు.కానీ, ఈ మధ్య స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ కు ఓకే చెబుతున్నారు. చాలాసార్లు స్టార్ హీరోయిన్లు చేసే ఐటమ్ సాంగ్సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడంతో నిర్మాతలు కూడా భారీగా ఖర్చు పెట్టి మరీ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. ఒక సినిమా మొత్తం చేస్తే వచ్చేంత రెమ్యున్ రేషన్ లేదా అందులో సగం ఒక్క ఐటమ్ సాంగ్ చేయడంతోనే వస్తుండడం, దానికి తోడు విపరీతమైన క్రేజ్ రావడంతో కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ కు సై అంటున్నారు.
బాలీవుడ్ లో కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్ మొదలెట్టిన ఈ ట్రెండ్ ను టాలీవుడ్ లో జనతా గ్యారేజ్ లో కాజల్ మొదలుబెట్టింది. ఇక, పుష్పలో ఐటమ్ సాంగ్ కు సమంత ఊ అనడంతో పాన్ ఇండియా రేంజ్ లో సామ్ మరింత పాపులర్ అయింది. దీంతో, సమంత లాగే గనిలో ఐటమ్ సాంగ్ లో తమన్నా,ఆచార్యలో రెజీనా చిందులేసి మెప్పించారట. ఇదే కోవలో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తరహాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా..రణబీర్ కపూర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం రష్మికను తీసుకోవాలనుకున్నారట. హిందీలో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్పలో హీరోయిన్ గా రష్మిక ఇప్పటికే పాపులర్ కావడంతో…ఆమెతో ఐటమ్ కమ్ స్పెషల్ సాంగ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.
అయితే, ఆ ఒక్క పాటకోసం రష్మిక మందన్న భారీ మొత్తం డిమాండ్ చేసిందట. ఒక్క పాటకోసం ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాకయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా మొత్తానికి రూ2 కోట్లు రెమ్యున్ రేషన్ తీసుకునే రష్మిక…ఒక్క ఐటమ్ సాంగ్ కోసం అంత మొత్తం డిమాండ్ చేయడంతో వారు ఆశ్చర్యపోయారట. అయితే, చివరకు బేరమాడి కోటిన్నరకు డీల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పారితోషికం ఫిక్స్ కావడంతో రష్మిక ఆ ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓ వారం పాటు డేట్స్ కూడా ఇచ్చిందట. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు క్రష్మిక పై సెటైర్లు వేస్తున్నారు. మరి, సమంత ఐటమ్ సాంగ్ లాగా ఈ ఐటమ్ సాంగ్ రష్మికకు పాపులారిటీ తెచ్చిపెడుతుందో లేదో తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి.