చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావటం.. అన్నీ అనుకున్నది అనుకున్నట్లుగా సాగటం తెలిసిందే. చంద్రుడి మీద కాలు మోపిన విక్రమ్ ల్యాండర్.. తనకు అప్పగించిన పనుల్ని నూటికి నూరు శాతం పూర్తి చేయటం, ముందుగా అనుకున్న ప్రకారం పగలు పూర్తి అయి రాత్రి మొదలైన వేళ.. అక్కడి అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు దాన్ని స్లీప్ మోడ్ లోకి పంపించటం తెలిసిందే. మరో పద్నాలుగు రోజుల తర్వాత తిరిగి యాక్టివేట్ చేయటానికి ప్రయత్నం చేయనున్నారు. వాస్తవానికి పద్నాలుగు రోజులు పని చేసేలా విక్రమ్ ల్యాండర్ ను రూపొందించినప్పటికి.. తమ అంచనాలకు భిన్నంగా మళ్లీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందా? అన్నది ఈ నెల 22న తేలనుంది.
చంద్రుడి మీద ఒక పగలు భూమిపై పద్నాలుగు రోజులతో సమానం. అదే టైంలో చంద్రుడి మీద రాత్రి.. భూమి మీద మరో పద్నాలుగు రోజులకు సమానం. ఇప్పుడు చంద్రుడి మీద రాత్రి వేళ నడుస్తోంది. రాత్రిళ్లు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వ్యోమనౌకల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోలేవు. అక్కడి సూర్యోదయం అయ్యే వరకు ఇంజిన్ ను స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లేలా చేసి.. మళ్లీ సూర్యోదయం అయ్యాక సూర్యరశ్శితో రీఛార్జ్ చేసేలా చేయనున్నారు. అయితే.. అత్యంత శీతల పరిస్థితుల్లో ఇంజిన్ ఏ పరిస్థితుల్లోకి వెళ్లనుందన్నది సందేహంగా మారింది. దాని రిజల్ట్ ఈ నెల 22కు కానీ తేలదు.
స్లీప్ మోడ్ లోకి వెళ్లేముందు మరో టాస్కును విక్రమ్ ల్యాండర్ కు ఇచ్చిన టాస్కును సూపర్ గా పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు విక్రమ్ ను స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లారు. దీనికి కాస్త ముందు ‘‘హోప్’’ అనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ టాస్కులో రోవర్ ను కిందకు దించటానికి వాడిన జారుడు బల్ల (అదేనండి ర్యాంప్)ను క్లోజ్ చేశారు. ఈ దశలో ల్యాండర్ లోని ఇంజిన్లకు అదేశాలు ఇచ్చారు. దీంతో కొంతమేర వాటిని మండించారు. దీంతో విక్రమ్ 40 సెంటీమీటర్ల మేర పైకి లేచింది. 30 నుంచి 40 సెంటీమీటర్ల మేర పక్కకు వెళ్లి.. సాఫీగా కిందకు దిగింది.
ఇది జరిగినతర్వాత ర్యాంప్నుకొత్త ప్రదేశంలో మొహరించారు.
హోప్ ప్రయోగం సక్సెస్ అయ్యాక.. దానికి సంబంధించిన డేటా భూమికి అందింది. హోప్ టాస్కు పూర్తి అయ్యాక స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లారు. ఎందుకీ ప్రయోగం అంటే.. రాబోయే రోజుల్లో చంద్రుడి నుంచి నమూనాల్ని భూమికి తీసుకొచ్చే మిషన్లు.. మానవసహిత యాత్రకు సంబంధించిన సన్నాహకాలకు హోప్ ప్రయోగం ఉపయోగపడనుంది. చంద్రుడి నుంచి మళ్లీ భూమికి తిరిగి వచ్చేలా డిజైన్లు భవిష్యత్తులో ఉంటే.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? జాబిల్లి ధూళిని ఇంజిన్లు తట్టుకుంటాయా? లేదా? లాంటివి ఈ టాస్కు ద్వారా అర్థమవుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు చంద్రుడి మీద రాత్రి మొదలై నేపథ్యంలో.. మైనస్ 2000 డిగ్రీల సెల్సియస్ చలిలో ఉన్న తర్వాత.. సూర్యోదయం మొదలై.. బ్యాటరీలు రీఛార్జి అయి పని చేయటం మొదలైతే మాత్రం ప్రది 14 రోజలకు ఒకసారి పని చేయటం.. మళ్లీ స్లీప్ మోడ్ లోకి వెళ్లటం జరుగుతుంది. బ్యాటరీ పని చేసినంత కాలం విక్రమ్ ల్యాండర్ తన ప్రయోగాల్ని కొనసాగిస్తూ ఉంటుంది.అయితే.. మళ్లీ విక్రమ్ పని చేస్తాడా? లేడా? అన్నది మాత్రం ఈ నెల 22న తేలనుంది. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.