వారిద్దరూ వేర్వేరు పార్టీల ఎంపీలు. ఒకరు బీజేపీ ఎంపీ, మరొకరు డీఎంకే ఎంపీ. పార్లమెంటరీ ఎస్టిమేట్స్ కమిటీలో ఆ ఇద్దరూ సభ్యులు. కమిటీ భేటీ జరిగితే పాల్గొనడానికి దిల్లీ వచ్చారు. భేటీలో ఇద్దరూ ఒక అంశంపై తీవ్రంగా వాదించుకున్నారు. భేటీ ముగిసింది… ఎవరికి వారు వెళ్లిపోయారు. అందులో ఒకరు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. కమిటీ భేటీ తరువాత ఆయన దిల్లీ నుంచి తన సొంత నగరం చెన్నై బయలుదేరారు. దిల్లీలో ఫ్లైట్ ఎక్కి ముందు సీట్లో కూర్చున్నారు.
కొద్దిసేపట్లో విమానం పైలట్ ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు.
‘మీరు కూడా ఇదే విమానంలో వస్తున్నారా?’ అని అడిగారు. పైలట్ మాస్కు ధరించి ఉండడంతో దయానిధి మారన్ ఆ పైలట్‌ను గుర్తించలేకపోయారు. కానీ, పైలట్ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఆయనకు అనిపించడంతో ఆలోచించడం మొదలుపెట్టారు.
ఆ విషయాన్ని గమనించిన పైలట్.. ‘మీరు నన్ను గుర్తించలేకపోయారు కదా?’ అంటూ మాస్కు వెనుక నుంచే చిరునవ్వులు చిందించారు.
అప్పుడర్థమైంది ఎంపీ దయానిధి మారన్‌కు.. ఆ పైలట్ మరెవరో కాదు.. తన సహచర ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అని. అంతేకాదు కొద్దిగంటల ముందు పార్లమెంటరీ ఎస్టిమేట్స్ కమిటీలో వాదన జరిగింది కూడా ఈ ఇద్దరు ఎంపీల మధ్యే. ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీని పైలట్‌గా చూసి దయానిధి మారన్ బోలెడంత ఆశ్చర్యపడిపోయారు. అంతకన్నా ఎక్కువ ఆనందించారు.
తనకు ఎదురైన ఈ అపూర్వ అనుభవాన్ని మారన్.. ‘ఎ ఫ్లైట్ టు రిమెంబర్’ శీర్షికతో ట్వీట్ చేశారు. పైలట్ దుస్తుల్లో ఉన్న రాజీవ్ ప్రతాప్ రూడీ ఫొటోను కూడా పెట్టారు. ఆ రోజు ఆయన తమను దిల్లీ నుంచి చెన్నైకి క్షేమంగా చేర్చారని పేర్కొంటూ.. ‘థాంక్ యూ కెప్టెన్’ అని కృతజ్ఞతలు తెలిపారు.
రాజీవ్ ప్రతాప్ రూడీ.. ఒకే మనిషి నాలుగు ప్రొఫెషన్స్.. ఇంకెన్నో స్పెషాలిటీస్
రాజీవ్ ప్రతాప్ రూడీ బిహార్‌లోని చాప్రా నియోజకవర్గ ఎంపీ. బీజీపీకి చెందిన ఆయన గతంలో కేంద్రంలో సివిల్ ఏవియేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేశారు. బీజేపీకి ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది.
అయితే, ఆయన ఏ సంస్థలోనూ పైలట్‌గా పనిచేయడంలేదు, జీతం తీసుకోవడం లేదు. కానీ, గౌరవ పైలట్‌గా అప్పుడప్పుడూ కొన్ని సంస్థలకు చెందిన విమానాలను నడుపుతుంటారు.
ఆయన అనేక విద్యాసంస్థలలో ఎకనమిక్స్ పాఠాలు కూడా చెబుతారు.
50 ఏళ్ల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన ఆయన ‘‘ఎయిర్ బస్ 320, ఎయిర్ బస్ 321 వంటి భారీ జెట్లు నడిపే పార్లమెంటేరియన్ ప్రపంచంలో నేను తప్ప వేరేవారు లేరేమో’’ అంటారు రూడీ.
చెన్నై నుంచి కేరళలోని కోచీకి 20 మంది ఎంపీలను తీసుకెళ్లిన రూడీ
జులై 13న దిల్లీ నుంచి చెన్నైకి విమానం నడిపిన రూడీ ఆ రోజు చెన్నైలో ట్రావెల్, సివిల్ ఏవియేషన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
అది పూర్తయిన తరువాత ఆ మరుసటి రోజు గురువారం చెన్నై నుంచి కేరళలోని కోచీకి విమానం నడిపారు.
కమిటీ సమావేశంలో పాల్గొన్న 20 మంది ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడీ నడిపిన విమానంలోనే ప్రయాణించారు.
వీరే కాదు ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ
Read Also: