సినిమా రంగంలో భారతదేశంలో అత్యున్నత అవార్డుగు పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ( 51 వ ఏడాది) సూపర్ స్టార్ రజనీకాంత్ ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ వార్తను స్వయంగా ప్రకటించారు.
రజనీకాంత్ సినిమా రంగానికి చేసిన అద్భుతమైన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 45 సంవత్సరాల సినీ జీవితంలో రజనీకాంత్ సినిమా రంగానికి చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన ఈ అవార్డుకు ఎపుడో అర్హత సాధించారు. ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించిన రజనీకాంత్… రోబో సినిమాతో ఇండియన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.
రజనీకాంత్ కు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్టైల్స్ అంటే ఇష్టపడని వాడే ఉండరు.
ఆయన అవార్డు ఇవ్వడం ఓకే గాని… దానిని రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయడం బీజేపీ చేసిన తప్పు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నప్పుడు ఈ అవార్డు ప్రకటన రావడంతో బీజేపీ గేమ్ ప్లాన్ గా ఇది అందరికీ అర్థమైంది. ఇది స్పష్టంగా రాజకీయ ప్రేరేపిత చర్య.
5 సంవత్సరాల క్రితమే ఆయనకు ఈ అవార్డు దక్కాల్సింది. కానీ రాజకీయ అవసరాల కోసం బీజేపీ ఆలస్యం చేసింది.