బహుశా మోడీ ప్రభుత్వ విభాగాలు చేసినన్ని బాధ్యతరాహిత్య ప్రకటనలు మరెప్పుడు విని ఉండం. కరోనా కారణంగా దేశంలో రైళ్లు నిలిపేశారు. 8 నెలలు పైగా అయ్యింది. 1000 స్పెషల్ రైళ్లు తప్ప సాధారణ రైళ్లు పునరుద్దరించలేదు. ఎపుడు ప్రారంభిస్తారబ్బా… అంటే సాధారణ రైళ్ల సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పలేమని రైల్వే బోర్డు పేర్కొంది.
కచ్చితమైన తేదీని చెప్పలేరట. కానీ రైళ్ల సేవలను పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి తెచ్చేప్రయత్నాలు చేస్తున్నారట. అధికారులు ఇప్పటికే పలు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారట. ప్రయాణికుల్లో కొవిడ్ భయం ఇంకా అలానే ఉందట. పరిస్థితులు అనుకూలంగా మారాక సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తారట.
- పైవి బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.
అసలు నిబంధనలతో రైళ్లు నడకపోతే ప్రయాణికులు ఎలా చేరుకోవాలి. జనం జాగ్రత్తలు తీసుకుంటారు. పరిమితంగా టిక్కెట్లు మంజూరు చేస్తే సరిపోతుంది. వీళ్లు రైలు ఆపేస్తే ఇంక ప్రజలకు ఎక్కువ నష్టం. ప్రైవేటు ఆపరేటర్లు విపరీతంగా దోచుకుంటున్నారు. అయినా ప్రజలెవరూ కోవిడ్ భయాన్ని ఇపుడు ఫీలవడం లేదు. ఎవరూ పనులు మానేసి ఇంట్లో కూర్చోవడం లేదు.