ప్రజలు వేసే ప్రతి ప్రశ్నకు కాంగ్రెస్ ను బూచిగా చూపుతూ మోడీ తనపై నిందలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ 70 ఏళ్లుగా దేశాన్ని నాశనం చేసిందని, దాని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతుంటారు. మంచిని తన ఖాతాలో, చెడును కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
నిజమే కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ఏనాడూ బరితెగించలేదు. ప్రజలంటే లెక్కలేకుండా ఏ నాడూ ప్రవర్తించలేదు. ప్రజలు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా కాంగ్రెస్ కు కాస్త గౌరవం ఉండేది. కానీ మోడీకి ఆ రెండూ లేవు.
2 సంవత్సరాలుగా మోడీ ఏం చేస్తున్నాడయ్యా అంటే కంపెనీలను అమ్ముతున్నాడు అని అంటోంది దేశమంతా. జగన్ రాష్ట్రాన్ని అమ్ముతుంటే మోడీ దేశాన్ని అమ్ముతున్నాడని విమర్శలు వస్తున్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి 6 లక్షల కోట్లను 5 సంవత్సరాల్లో సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. దీనిపై ప్రజలంతా మండిపడుతున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ మధ్య రాహుల్ గాంధీ మోడీకి మంచి పంచ్ లే వేస్తున్నాడు. ఈరోజు కూడా మోడీపై వేసిన పంచ్ పేలింది.
కాంగ్రెస్ కేవలం నష్టాల్లో ఉన్న వాటిని వ్యూహాత్మకంగా ప్రైవేటీకరణ చేసింది. దానివల్ల ప్రభుత్వానికి ప్రతి సారి ఏర్పడి నష్టం తగ్గడంతో పాటు ఆదాయం కూడా వచ్చేది. కానీ మోడీ సర్కారు లాభాలు వచ్చే కంపెనీలను అమ్మేస్తుంది. తన మిత్రులను ధనవంతులను చేయడానికే ఈ పథకం పెట్టారు అని రాహుల్ అన్నారు. అసలు పంచ్ ఏంటంటే…. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మోడీ అంటుంటారు నువ్వు ఇపుడు అమ్ముతున్నవన్నీ 70 ఏళ్లుగా కాంగ్రెస్ నిర్మించినవే అని రిటార్ట్ ఇచ్చారు.