బ్లూ మీడియా జర్నలిస్టులకు రఘురామ స్టైల్ వార్నింగ్

Andhra Oct 14, 2020


మీకు నచ్చిన నాయకుడు అధిక సీట్లు తెచ్చుకుని గెలిచినంత మాత్రాన అంతకుముందు చేసిన తప్పులు అన్నీ ఒప్పులై పోవన్న కనీస జ్జానం లేకుండా మాట్లాడుతున్న బ్లూ మీడియాకు చెబుతున్నాను. అయ్యా మీరు రాజ్యాంగాన్ని చదువుకోండి. మీకు అర్థం కాకపోతే నన్నడిగితే చెబుతాను. పనికిరాని అబద్ధాలను ప్రచారం చేస్తే తదనంతర శిక్షను మీరు కూడా అనుభవించక తప్పదు అంటూ ప్రజా నేత రఘురామరాజు హెచ్చరించారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న మీకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కోర్టును మరింత దృఢంగా ఏర్పాటుచేశారనే విషయం తెలియకపోవడం మూర్ఖత్వం అన్నారు రాజుగారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ప్రొటెక్షన్ న్యాయమూర్తులకు ఉందన్నారు.

మీ ఫేవరెట్ నాయకుడు ఒక అబద్ధాన్ని విసరడం దానిని మీరు చిలువలు పలువలుగా మార్చి పది అబద్ధాలుగా ప్రచారం చేయడం. మీరు ఎంత శ్రమపడినా... నిజం నిజం కాకుండా పోదు. అబద్ధం ఎన్నటికీ నిజంగా మారదు అన్నారు.రాజధానికి సుదూరంగా మేజర్లు అయిన ఇద్దరు కూతుర్లు ఏదో స్థలం సొంత డబ్బులతో కొనుక్కుంటే అడ్డదిడ్డంగా అబద్దాలతో కూడిన నిందలు వేసి ప్రతిష్టను దిగజార్చి, అల్లరి చేయడం అత్యంత విచారకరం, దారుణం అన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వ్యక్తే రక్షకుడే తక్షకుడై (జగన్ ని ఉద్దేశించి) టార్చర్ పెడుతున్నాడని రఘురామరాజు విమర్శించారు. జగన్ పెయిడ్ ఆర్టిస్టులు ఇంగ్లిష్ ఛానెల్లలోకి వచ్చి ఇష్టం వచ్చిన అబద్ధాలను అలవోకగా ప్రచారం చేస్తున్నారని... ఎంత చేసినా ఏమీ కాదని అన్నారు. ఈ వ్యవహారం అన్నిటిపై తాను రాష్ట్రపతికి కూడా లేఖరాసినట్టు రఘురామరాజు వెల్లడించారు. బ్లూ మీడియా జర్నలిస్టులకు తనదైన శైలి హెచ్చరికను చేసిన రఘురామరాజు వీడియో ఈ కింద చూడొచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.