రఘురామరాజు పిల్లల స్పీడు చూస్తుంటే జగన్ వర్గానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతకాలం అంతా రాజు ఒక్కడే నడిపిస్తున్నట్టు అనుకున్నారు.
కానీ పిల్లలు రాజు కంటే స్పీడుగా ఉన్నారు. నాన్న అన్ని పరిచయాలు పిల్లలకు నేరుగా తెలుసు అనే విషయం తాజా పరిణామాలతో అర్థం అవుతుంది.
తండ్రి ఏపీ జైలులో మగ్గిపోకుండా రాజు కొడుకు భరత్ వేసిన వ్యూహమే దీనికి ఉదాహరణ.
తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసారు రఘురామ తనయుడు భరత్.
కస్టడీలో తన తండ్రి మీద దాడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అది కూడా సీబీఐ లేదా ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలన్న భరత్ విజ్జప్తి పిటిషను సంచలనం అయ్యింది.
ఈ పిటిషను ప్రతివాదులుగా సీఎం జగన్, సీబీసీఈఐడీ అధికారులను చేర్చారు.
దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.
న్యాయమూర్తులు వినీత్శరణ్, బీఆర్ గగాయ్ నేతృత్వంలో ఈ పిటిషనుపై విచారణ జరగనుంది.