ఎంపీ రఘురామరాజుకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది.
రాజద్రోహం కేసు కింద అదేపనిగా బెయిల్ రాకుండా పెట్టిన కేసులోను పిటిషనరు వాదనల విన్న అనంతరం ప్రభుత్వ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని సుప్రీంకోర్టు భావించడంతో రఘురామరాజుకి బెయిలు ఇచ్చింది.
గుంటూరు ఆస్పత్రిలో ఏ గాయాలు లేవని ఇచ్చిన రిపోర్టు కూడా తప్పని ఆర్మీ ఆస్పత్రి రిపోర్టు తేల్చడం వల్ల ఏపీ పరువు దేశవ్యాప్తంగా పోయింది.
ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని స్టేషనులో కొట్టడం ఏంటి అని రఘురామ లాయరు ముకుల్ రోహ్ తగి ఏపీలో పౌరహక్కులపై వ్యక్తంచేసిన అనుమానం కోర్టు నమ్మింది.
జగన్ పై కొన్ని వందల కేసులు ఉన్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ వల్లే రఘురామరాజును అరెస్టు చేసి వేధిస్తున్నారని ముకుల్ వాదించారు.
చివరకు ఆర్మీ ఆస్పత్రి రిపోర్ట్ అనంతరం ప్రభుత్వ లాయరు తీరును కూడా ప్రశ్నించిన సుప్రీంకోర్టు… మొత్తం పరిణామాలు పరిశీలించిన అనంతరం రఘురామరాజు బెయిలు పొందడానికి అర్హుడే అని తేల్చింది.