జగన్ ని తిడితే ఆయన కార్యకర్తలు స్పందిస్తారు. క్రిస్టియానిటీని పొరపాటున ఒక మాట అన్నా అది ఆ మతానికి మంచి చెబుదామని అన్నా … స్వయంగా జగన్ పార్టీ అధిష్టానం స్పందించేస్తుంది. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, రఘురామకృష్ణరాజు దేశద్రోహి అని పార్టీ కొత్త నినాదం మొదలుపెట్టింది. క్రిస్టియన్ల కోసం ముగ్గురు పాస్టర్లు మధ్యలో అనేక మంది హిందు వైసీపీ కార్యకర్తలు కలిసి రఘురామరాజుగారి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ ధర్నాచేశారట.
పైగా ధర్నాలో పాల్గొన్న వారు బొట్లు పెట్టుకుని ఉన్న విషయాన్ని పట్టేసిన రఘురాముడు దానిని మీడియాకు చూపించారు. పార్టీని కాపాడుకుందామని నేను ప్రయత్నం చేస్తుంటే… నన్ను పార్టీ భారంగా భావిస్తే నేనేం చేయను అని రఘురామరాజు ఆవేదన వెలిబుచ్చారు.
నా ప్రియతమ ముఖ్యమంత్రి, నా పార్టీ బాగుండాలని కోరుకుంటున్న నన్ను పార్టీ నుంచి వెలివేయాలని వారు అనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను. అది నాకే మంచిది. పార్టీకి, పార్టీ పెద్దకు చాలా అనునయంగా కాపాడుకుంటూ రావాల్సిన అవసరం కూడా అప్పుడు నాకుండదు. నేనయితే పార్టీ మంచి కోసమే పనిచేస్తున్నాను. ఆ విషయం నాకు ఎరుక ఉండి చేస్తున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను. నేడో రేపో సస్పెండ్ చేస్తారేమో. అలాగే అనిపిస్తుంది చూస్తుంటే అని రఘురామరాజు అన్నారు.