జగన్ తన లాయర్ల ద్వారా ఎన్నో ఐడియాలు విని ఉంటాడు. తన జీవితంలో ఎంతో మందిని చూసి ఉంటాడు, ముఖ్యమంత్రిగా కూడా ఎంతో పోలీసు బర్రలతో తన ఆలోచనలు పంచుకుని ఉంటాడు. కానీ ఒక సాధారణ ఎంపీ తనకు ఇన్ని ట్విస్టులు ఇవ్వగలడు అని అతనికి ఎవరూ చెప్పి ఉండరు.
దటీజ్ రఘురామరాజు అనే వైసీపీ నేతలతోనే చివరకు ఒప్పించేలా ఉన్నాడు రఘురామరాజు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంటికింద రాయిలా మారిన ఈ వైసీపీ రెబల్ ఎంపీ ఇప్పటికే ఇచ్చిన ట్విస్టులకు జగన్మోహన్ రెడ్డి షాక్ మీద ఉన్నారు. కానీ RRR తాజా షాక్ మాత్రం ఆయన కచ్చితంగా ఊహించి ఉండడు.
సీఐడీ అధికారులతో అరెస్టు చేయిస్తే భయపడి ఊరికే ఉంటాడు అనుకుంటే ఇంతకాలం డైలాగులు చెప్పిన అతను ఇపుడు యుద్ధం చేస్తున్నట్లు ఉంది సీన్.
తనపై మోపిన రాజద్రోహం కేసునే లేపేసే ఒక యజ్జాన్ని రఘురామరాజు మొదలుపెట్టారు. దీనికి దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రాజుల పరివారపు సాయం తీసుకుంటున్నారు. అతనికి నేరుగా 50 మంది ఎంపీలు (తన సామాజిక వర్గం-రాజ వంశాలు దేశ వ్యాప్తంగా ఉన్నవారు) అండగా ఉన్నారట. వారి సాయంతో ఆయన అన్ని రాష్ట్రాల్లో చక్రం తిప్పే పని చేస్తున్నారు.
సీబీఐ కస్టడీలో దాడి ఇతర అంశాలను పేర్కొంటూ ఇప్పటికే ఎంపీలు, ఇటీవలే ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాశారు. సహజంగానే ఈ లిస్టులో ఏపీ సీఎం జగన్ పేరు లేదు.
సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయా రాష్ట్రాల సీఎంలకు రాసిన లేఖలో రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడంతో.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేయించారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాజద్రోహం సెక్షన్ కు వ్యతిరేకంగా ఉద్యమించాలని.. రాజద్రోహం సెక్షన్ ను తొలగించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని అన్ని రాష్ట్రాల సీఎంలను రఘురామ కోరారు. ఈ విషయంపై పార్లమెంటులో తనకు మద్దతు ఇచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని అన్ని రాష్ట్రాల సీఎం కోరారు.