ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణం లాగనే నేడు ఏపీలో న్యాయదేవతను వివస్త్రను చేసే ప్రయత్నం జరుగుతోందని… కానీ ఆనాడు గోవిందుడు ఆమెను కాపాడినట్లే ఈనాడు కోవిందుడు (రాంనాథ్ గోవింద్) కాపాడతాడని నరసాపురం ఎంపీ రఘురామరాజు అన్నారు. ఒక పద్ధతి ప్రకారం న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు రఘురామరాజు.
151 కౌరవ సంఖ్యలో నేను భాగమైనందుకు చింతిస్తున్నట్లు చెప్పారు ఆయన. పలువురు రెడ్లు కోర్టులను దూషిస్తే వారిపై కనీస చర్యలు లేకపోవడం, ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేని, చేతకాని, నిస్సహాయ, నిస్సిగ్గు సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందని రఘురామ ఆరోపించారు.
వ్యవస్థను వివస్త్రను చేయాలని వారు తలపెట్టిన కార్యంలోనే వారు అంతమైపోతారని… ఇలాంటి చర్యలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా రాజ్యాంగాన్ని రచించారని రఘురామరాజు అన్నారు. ఏపీలో జరుగుతున్నది ధరిత్ర ఎరుగని చరిత్ర. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించకూడదు అని స్పస్టంగా నిబంధనలు ఉన్నా తెగించడం వెనుక కారణాలు ఎంత బలమైనవో అర్థం చేసుకోవాలన్నారు.
మొన్న తెలుగు తల్లికి అన్యాయం చేసిన వారు నేడు న్యాయదేవతకు అన్యాయం చేస్తున్నారు. ఇదిలాగే వదిలేస్తే ఎన్ని హద్దులు అయినా అతిక్రమించే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం.