అందివచ్చిన సాంకేతికత సాయంతో తక్కువ ఖర్చు.. రోటీన్ కు భిన్నమైన అనుభూతి మాత్రమే కాదు.. చూసినంతనే వావ్ అనేలా చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. పెళ్లి వేడుక వేళ.. ఖరీదైన శుభలేఖ లు ఇవ్వటం తెలిసిందే. నిజానికి ఈ శుభలేఖల మీద పెట్టే ఖర్చుతో మంచి బహుమతిని ఆహ్వానితులకు ఇవ్వొచ్చు. కానీ.. తమ స్టేటస్ ప్రదర్శించుకోవటానికి వీలుగా చాలా మంది ఖరీదైన శుభలేఖల్ని అచ్చేయిస్తుంటారు. ఇందుకు భిన్నంగా రాజమహేంద్రవరానికి చెందిన యువ జంట వినూత్న రీతిలో కొత్త తరహా శుభలేఖను సిద్ధం చేసింది.
క్యూఆర్ కోడ్ తో సిద్ధం చేసిన ఈ శుభలేఖ.. రోటీన్ శుభలేఖకు భిన్నంగా ఉండటం మరో విశేషం. పెళ్లి వేళ.. చేసే నలభైకు పైగా సంప్రదాయాలను అందులో పొందుపర్చటం.. ఏ కార్యక్రమం వేళ ఏం చేస్తారన్న విషయాన్ని తెలియజేసిన వైనం అందరిని ఆలోచించేలా చేస్తోంది. ఇటీవల కాలంలో పెళ్లి వేడుకను అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవటం ట్రెండ్ గా మారిన వేళ.. పెళ్లి టైంలో చేసే అన్ని కార్యాలను ఈ శుభలేఖలో పొందుపర్చారు.
రాజమహేంద్రవరానికిచెందిన శివస్వామి అలియాస్ సత్యశివకుమార్.. దుర్గాభవానీలు కొత్త తరహా క్యూఆర్ కోడ్ శుభలేఖను డిజైన్ చేయించారు. వారి పెళ్లి రేపు (ఆదివారం, ఏప్రిల్ 21న) అన్నవరం క్షేత్రంలో జరగనుంది. పెళ్లి వేళ బంధువులు.. స్నేహితులకు ఇచ్చే శుభలేఖలో.. ఎంగేజ్ మెంట్ మొదలు పదహారు రోజుల పండుగ వరకు సుమారు 45 కీలక ఘట్టాలకు సంబంధించిన అంశాలు.. వాటి విశిష్టతను తెలియజేసేలా 40 పేజీల్లో ఈ డిజిటల్ శుభలేఖను సిద్ధం చేశారు.
వినాయకుని బియ్యం.. ఆహ్వానపత్రిక సిద్ధం చేసే ముహుర్తం.. పందిరి ఆట.. మంగళస్నానాలు.. స్నాతకం.. మదుపర్కం.. భాషికాలు.. ఇలా పెళ్లికి సంబంధించిన అన్నీ అంశాల్ని పొందుపర్చటం.. ఏ కార్యక్రమంలో ఏమేం చేస్తారు. అన్న అంశాల్ని ఇందులో ఉంచారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు.. శుభలేఖను ఎంచక్కా చూసుకునేలా చేయటమే కాదు.. దాన్ని తమతో ఉంచుకునేలా వీరి ప్రయత్నం ఉంది. తాము కూడా ఈ తరహా శుభలేఖలను సిద్ధం చేయించా