• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రఘురామ ఫోన్ చుట్టూ రచ్చ రచ్చ

admin by admin
June 6, 2021
in Andhra, English, Top Stories, Trending
0
0
SHARES
415
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇన్ని రోజులూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు.. కస్టడీలో ఆయనపై పోలీసుల ప్రతాపం.. ఒంటిపై గాయాలకు సంబంధించిన వైద్య నివేదికలు.. కోర్టు విచారణ.  బెయిల్ మంజూరు లాంటి అంశాలే చర్చనీయాంశంగా ఉన్నాయి.

ఐతే బెయిల్ మీద బయటికి వచ్చాక రఘురామ తనను ఇబ్బంది పెట్టిన వాళ్లందరినీ టార్గెట్ చేస్తూ తనేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తన అరెస్టుపై తోటి ఎంపీలందరికీ ఆయన లేఖ రాయడం తెలిసిందే.

మరోవైపు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహరించిన ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్‌ను ఆయన లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. కస్టడీ టైంలో తన మొబైల్ ఫోన్‌ను సునీల్ కుమార్ బలవంతంగా లాక్కున్నారని, తనను హింసించి మరీ పాస్‌వర్డ్ తెలుసుకుని మొబైల్ అన్‌లాక్ చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రఘురామ మొబైల్ గొడవలోకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ రావడం గమనార్హం. రఘురామ నంబర్ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ సందేశాలు వస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయమై రఘురామ స్పష్టత ఇవ్వాలంటూ ఆయన మొబైల్ నంబర్‌ను సైతం ట్విట్టర్లో షేర్ చేశారు రమేష్.

దీనిపై రఘురామ వెంటనే స్పందించారు. ‘‘నన్ను అరెస్టు చేసిన మే 14నే నా ఫోన్‌ను సీఐడీ పోలీసులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ వారి దగ్గరే ఉంది. నాలుగు రోజుల కిందట నా సిమ్ బ్లాక్ చేసి కొత్తది తీసుకున్నాను. ఫోన్ తిరిగివ్వాల్సిందిగా శుక్రవారం సీఐడీకీ లీగల్ నోటీసులు కూడా ఇచ్చాను.

మే 14 నుంచి జూన్ 1 వరకు నేను ఎవరికీ మెసేజ్‌లు కూడా పంపలేదు. ఒకవేళ నా ఫోన్‌ను అక్రమంగా ఉపయోగించి ఉంటే సునీల్ కుమార్, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని రఘురామ పేర్కొన్నారు.

కాగా పీవీ రమేష్‌కు, సునీల్ కుమార్‌కు ఉన్న కుటుంబ గొడవలు ఇక్కడ ప్రస్తావనార్హం. సునీల్ సతీమణి.. రమేష్ సొంత సోదరి కావడం గమనార్హం. తనపై సునీల్ గృహహింసకు పాల్పడినట్లు ఆమె గతంలో పోలీసులను ఆశ్రయించారు. ఈ గొడవ కొన్నేళ్లుగా నడుస్తోంది.

ఐతే సునీల్ కుమార్ విషయంలో రఘురామను రమేష్ సోదరి సాయం కోరినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్న రఘురామను అరెస్టు చేయడానికి సునీల్ అత్యుత్సాహం చూపించారని.. రఘురామతో రమేష్ సోదరి టచ్‌లో ఉందేమో తెలుసుకునేందుకు ఆయన ఫోన్ నుంచి మెసేజ్‌‌లు పంపి ఉండొచ్చని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

From 14th May till 1st June I have not sent any messages to anyone. I assure you that appropriate legal action would be initiated against sunil kumar and others if they misused in violation of rules.

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 5, 2021

Tags: andhrapradeshpv rameshRaghuramarajuRRRYSRCP
Previous Post

Photos: కాజల్ హాట్ ఫొటో వైరల్ !!

Next Post

​న్యాయవాదికి 96 లక్షల ఫీజా… ఏం జరుగుతోంది ఏపీలో

Related Posts

KCR
Trending

బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?

November 28, 2023
Trending

టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర

November 28, 2023
Trending

చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?

November 28, 2023
Trending

వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్

November 27, 2023
pawan and jagan
Top Stories

ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!

November 27, 2023
Telangana

బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?

November 27, 2023
Load More
Next Post

​న్యాయవాదికి 96 లక్షల ఫీజా... ఏం జరుగుతోంది ఏపీలో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు
  • విమానాశ్ర‌యంలో `రోడ్ షో` ఏంటి మోడీ సాబ్!?
  • ‘ఇక మొద‌లెడ‌దామా’ అంటోన్న లోకేష్ .. ట్రెండింగ్
  • పెళ్లిపై తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ రియాక్షన్ ఇదే
  • దేవుడి బంగారానికి రెక్కలు!

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

విశాఖ ఐటీ ని ముంచేశారు!

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra