స్టార్ హీరోగా ఎదిగినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో సింపుల్ గా ఉంటాడు. ఆ సింప్లిసిటీ నే అతనికి అభిమానుల సంఖ్యను రోజు రోజుకూ పెంచుతుంది. పుష్ప సినిమాతో ఇండియా వైడ్ స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ తాజాగా ఓ రోడ్ సైడ్ ధాబాలో తన భార్య స్నేహారెడ్డితో కలిసి భోజనం చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏపీలో ఎన్నికల ప్రచారం చివరిరోజున బన్నీ, తన భార్య స్నేహతో కలిసి నంద్యాల వెళ్లాడు. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవిచంద్రరెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లాడు. అయితే ఈ ప్రచారం అనంతరం తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఒక రోడ్ సైడ్ ధాబాలో ఆగి భోజనం చేసినట్లు సమాచారం.
అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు ప్రకటించడం మెగా, అల్లు ఫ్యామిలీలో కాక రేపుతుంది. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ విమర్శలతో ఆ ట్వీట్ ను డిలేట్ చేశాడు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూపుల నుండి అల్లు అర్జున్ బయటకు వచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోటో ఇంకో వైరల్ గా మారింది.