ప్రముఖ తెలుగు నిర్మాత మహేష్ కోనేరు ఇక లేరు. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో గుండె పోటుతో కన్నుమూశారు.
జూనియర్ ఎన్టీఆర్‌కి, కళ్యాణ్ రామ్‌కి పర్సనల్ పీఆర్వోగా పని చేసిన మహేష్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలను నిర్మించారు.
118, తిమ్మరుసు, మిస్ ఇండియా వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, నాగశౌర్య, సందీప్ కిషన్, అల్లరి నరేష్లతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంతలోనే ఇలా జరగడం ఇండస్ట్రీవారిని కలచివేస్తోంది.
ఎంతో సౌమ్యంగా, స్నేహంగా ఉండే మహేష్ హఠాన్మరణం ఇండస్ట్రీని షాక్‌కి గురి చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ చాలా ఉద్వేగానికి లోనయ్యారు.
‘నా ప్రియమిత్రుడు మహేష్ ఇక లేడనే వార్తను బరువెక్కిన హృదయంతో మీ అందరికీ చెబుతున్నాను. నేనిప్పటికీ నమ్మలేక పోతున్నాను. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తన కుటుంబానికి, ఆత్మీయులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.
With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless.
My sincerest condolences to his family and his near and dear. pic.twitter.com/VhurazUPQk
— Jr NTR (@tarak9999) October 12, 2021