ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి.
అబద్ధాలతో ప్రజలను నమ్మించి పబ్బం గడుపుతున్న వైసీపీ జనం సమస్యలు వదిలి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం ప్రజలెవరికీ నచ్చడం లేదు.
ఒకవైపు వరదలతో 5 జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ముందే అలర్ట్ చేయడంలో విఫలమైన ప్రభుత్వం తదనంతరం కూడా పట్టించుకోవడం మానేసింది. ప్రజలను వారి మానాన వారిని వదిలేసింది.
పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో అరచాకలు చేస్తోంది. అదే పోలీసులతో ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకుంటోంది. ఇదంతా చాలదన్నట్లు నిన్న ప్రతిపక్ష నేత ఇంట్లో ఆడవారిని కూడా టార్గెట్ చేసింది జగన్ పార్టీ. దీంతో మనస్థాపం చెందిన చంద్రబాబు అసెంబ్లీకి గుడ్ బై చెప్పారు.
ఇది ఏపీలో చాలామందిని కలచివేసింది. ప్రభుత్వం చేసే తప్పులకు వంత పాడుతున్న పోలీసు వ్యవస్థలో ఉద్యోగం చేయలేను, అంటూ తాజా పరిణామాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ స్పందించారు.
రాష్ట్రంలో పరిస్థితి, అధికార పార్టీ దారుణాలు చూసి బాధ కలిగిందని.. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన తన పేరు విజయ్ కృష్ణ అని.. 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్.. 2002 ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా నిలిచానన్నారు.. 2003లో కూడా బెస్ట్ షూటర్ అన్నారు.
చంద్రబాబు హయాంలో తనకు ఉద్యోగం వచ్చింది, పైసా లంచం ఇవ్వలేదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా చేయి చాచలేదు. నీతి, నిజాయితీతో ఉద్యోగం చేశాను. రాష్ట్రంలో పరిస్థితులు పోలీసులకు తెలుసు.. నైతిక విలువలు, నిబద్దత కోల్పోయిన ఈ ప్రభుత్వంలో పనిచేయలేను. అందుకే సిగ్గుపడి ఈ వీడియో చేస్తున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని విజయ్ కృష్ణ వీడియో విడుదల చేశారు.