జనరల్ ఎలక్షన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మంచు విష్ణు విజయం సాధించటం తెలిసిందే.
‘మా’ ఫలితాలు వెల్లడి తర్వాత నుంచి ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. #
మంచు ఫ్యామిలీని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా అలాంటి పనే మరింత గట్టిగా చేశారన్న మాట వినిపిస్తోంది.
‘మా’ ఎన్నికల్లో భాగంగా జరిగిన పోలింగ్ వేళ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు ప్రకాశ్ రాజ్ టీం.
తాజాగా ‘మా’ పోలింగ్ లో రౌడీషీటర్లు ప్రభావితం చేశారంటూ సంచలన ఆరోపణను సంధించారు.
వైసీపీ నాయకుడు నూకల సాంబశివరావు పోలింగ్ బూత్ లో మంచు విష్ణు వెంట ఉన్నారని.. అతనిపై రౌడీ షీట్ కూడా ఉందన్నారు.
దీనికి సంబంధించిన ఆధారాల్ని జత చేస్తూ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ రాయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
#MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN
— Prakash Raj (@prakashraaj) October 22, 2021
అంతేకాదు.. ‘మా’ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. చాలామంది రౌడీ షీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు కుటుంబంతో నూకల సాంబశివరావు ఉన్న ఫోటోలను ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో విడుదల చేశారు.
పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు.. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సాంబశివరావును అభివర్ణించారు.
నోట్ల రద్దు వేళ కోట్లాది రూపాయిల్ని తరలించిన ఆరోపణలు కూడా అతనిపై ఉన్నట్లు పేర్కొన్నారు.
జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో అతనిపై రౌడీ షీట్ ఉందన్న ప్రకాశ్ రాజ్.. ఇదంతా ఆరంభం మాత్రమేనని.. ఎన్నికల అధికారి సీసీ ఫుటేజ్ ఇస్తే.. మా ఎన్నికల్లో జరిగిన అక్రమాల్ని బయటపెడతామన్నారు.
తాజా పోస్టుతో ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల ఎపిసోడ్ ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చారని చెప్పాలి.
ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టిన KTR
వైసీపీని ఉడికించిన రామ్మోహన్ నాయుడు